*ఈ నెల 28వ తేది సాయత్రం ఎం.జె మార్కెట్ ప్రాంగణంలో గజల్ షాయారీ కార్యక్రమం*
*హైదరాబాద్, సెప్టెంబర్ 23:* హైదరాబాద్ వారసత్వాన్ని కాపాడుట, కళలను ప్రోత్సహించేందుకు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేది సాయత్రం ఎం.జె మార్కెట్ ప్రాంగణంలో గజల్ ,షాయారీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రముఖ గజల్ ,షాహిరి కళాకారులచే కార్యక్రమం నిర్వహించనున్నందున ఆసక్తిగలవారు బుక్ మై షో లింకు ద్వారా బుక్ చేసుకొని సీటును రిజర్వ్ చేసుకోవాలని జిహెచ్ఎంసి కోరింది.
గ్రేటర్ హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడేందుకు జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. హైదరాబాద్ వారసత్వ సంపదను భవిష్యత్తు తరాల వారికి అందించాలనే సంకల్పంతో ప్రజా సంబరాలు కార్యక్రమాల ద్వారా చేపట్టడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసిననట్లు కమిషనర్ ఆమ్రపాలి కాట ఒక ప్రకటనలో తెలిపారు.
. పరిమిత సీట్లు ఉన్నందున ఆసక్తి గల వారందరూ బుక్ మై షో ద్వారా బుకింగ్ చేసుకోవాలని కమిషనర్ కోరారు.