
వైద్య కళాశాల ఖాళీల నియామకాల పై అభ్యంతరాలు తెలుపండి
జిల్లా కలెక్టర్ అభికాశాభినవ్
ఫిబ్రవరి 19, 2025, నిర్మల్:-
వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి చేపట్టిన నియామకాల దరఖాస్తులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 24వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా వైద్య కళాశాలలో పరుగు సేవల పద్ధతిన 32 ఖాళీల భర్తీ నియామక ప్రక్రియలో భాగంగా, అర్హులైన అభ్యర్థులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 20వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఖాళీల భర్తీ ప్రక్రియ కొరకు డాక్టర్ అంకిత్ రాజ్ ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ పై ఎటువంటి సందేహాలు ఉన్నా నోడల్ అధికారి మొబైల్ నెంబరు 9494392355, మెయిల్ ఐడి recruitmentgmcnirmal@gmail.com ను సంప్రదించవచ్చునన్నారు. అర్హులపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న నిర్మల్ అధికారిక వెబ్ సైట్, వైద్య కళాశాల అధికారిక వెబ్ సైట్ నందు పొందుపరిచిన గూగుల్ ఫారం ను నింపి తమ అభ్యంతరాలను తెలుపవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.