Thursday, April 3, 2025

*గ‌చ్చిబౌలిలోని TGIIC కి చెందిన 400 ఎక‌రాల‌పై 2004 లోనే యాజ‌మాన్య హ‌క్కుల‌ను వ‌దులుకున్న HCU*

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ కు అనుకుని కంచ గ‌చ్చిబౌలి, గోప‌న ప‌ల్లి అనే రెండు గ్రామాలున్నాయి. గోప‌న‌ప‌ల్లి గ్రామంలోని స‌ర్వే నెం. 36, 37 లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి 397.16 ఎకరాల భూమి ఉంది. కంచ గ‌చ్చిబౌలి గ్రామంలో స‌ర్వే నెం.25 లో యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ కు 534.28 ఎక‌రాల భూమి ఉంది.

అయితే అటు యూనివ‌ర్సీటి, అటు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ‌ అవ‌సరం మేర‌కు ఆయా భూముల‌ను పరస్ప‌రం మార్చుకున్నాయి. అంటే గోప‌న‌ల్లిలో త‌న ఆదీనంలో ఉన్న‌ 397.16 ఎక‌రాల‌ను యూనివ‌ర్సీటీకి రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌ద‌లాయించింది. కంచ గ‌చ్చిబౌలి లోని త‌న ఆదీనంలో ఉన్న 534.28 ఎక‌రాల‌ను  రాష్ట్ర ప్ర‌భుత్వానికి యూనివ‌ర్సీటీ ఆఫ్ హైద‌రాబాద్ బ‌ద‌లాయించింది.

దీనికి సంబంధించి జ‌న‌వ‌రి 31, 2004 లో ఒప్పందాలు చేసుకున్నారు. యూనివ‌ర్సిటీ త‌రుపున రిజిస్ట్రార్ వై. న‌ర‌సింహులు (అప్ప‌టి హోం మంత్రి దేవేంద‌ర్ గౌడ్ ద‌గ్గ‌రి బంధువు), ప్ర‌భుత్వం త‌రుపున గిర్దావ‌ర్ ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేసారు. దీంతో కంచ గ‌చ్చిబౌలి లో 534.28  ఎక‌రాల భూమిపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి, గోప‌న ప‌ల్లి లోని 397.16 ఎక‌రాల‌పై హెచ్ సీ యూకి యాజ‌మాన్య హ‌క్కులు దక్కాయి. ఆ త‌ర్వాత త‌మ భూముల‌ను ఎవ‌రికి వారు అభివృద్ది చేసుకుని త‌మ అవ‌స‌రాల‌కు వాడుకుంటున్నారు. గోప‌న ప‌ల్లి గ్రామంలో హెచ్ సీ యూ ఏకంగా నిర్మాణాలు చేప‌ట్టింది.

భూ బ‌దాల‌యింపు త‌ర్వాత‌.. కంచ గ‌చ్చిబౌలి లో త‌న‌కు వ‌చ్చిన‌ 534 ఎక‌రాల భూమిలో… అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం 400 ఎక‌రాల‌ను ఎం ఐ జీ అనే సంస్థ‌కు, మిగిలిన 134 ఎక‌రాల‌ను ఎపీఎన్జీఓ ల‌కు కేటాయించింది. 134 ఎక‌రాల్లో ఎపీ ఎన్జీఓ, టీఎన్జీఓ లు చ‌క్క‌గా ఇండ్లు క‌ట్టుకుని నివ‌సిస్తున్నారు. చాల మంది మాజీ మంత్రులు, టీఎన్జీఓ పెద్ద‌ల ఇండ్లు ఉన్నాయి.

అయితే త‌న‌కు కేటాయించిన 400 ఎక‌రాల్లో ఒప్పందాల‌కు విరుద్దంగా ఎం ఐ జీ నిర్మాణాలు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో 2006 లో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ 400 ఎక‌రాలను  రాష్ట్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. అప్ప‌టి నుంచి మే 3, 2024 వ‌ర‌కు హైకోర్టు, సుప్రీం కోర్టు లో 20 సంవ్స‌రాల పాటు సూదీర్ఘ వాద‌న‌లు కొన‌సాగాయి. ఈ 20 సంవ‌త్స‌రాల పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని కోర్టుల్లో స‌మ‌ర్ద‌వంతంగా వాద‌లు వినిపించి త‌న యాజ‌మాన్య హ‌క్కుల‌ను కాపాడుకుంది.

ఈ 20 ఏండ్ల‌లో ఆ భూమి త‌న‌ద‌ని ఒక్క సారి కూడా హెచ్ సీ యూ కోర్టుల్లో ఇంప్లీడ్ కాలేదు. కానీ సుప్రీం కోర్టు లో ఎం ఐ జీ కి ఎదురు దెబ్బ తగిలి, ఆ భూమి రాష్ట్ర ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని సుప్రీం కోర్టు త‌న తీర్పు వెల్ల‌డించిన త‌ర్వాతనే ఆ భూమి త‌మ ద‌ని హెచ్ సీ యూ పేర్కొన‌డం న్యాయ‌బ‌ద్దంగా లేదు.
20 సంవత్స‌రాల పాటు ఆ భూమిని ప్రైవేటు గ‌ద్ద‌లు త‌న్నుక‌పోకుండా కాపాడి, లాయ‌ర్ల‌కు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు పోసి రాష్ట్ర ప్ర‌భుత్వం కేసు గెలిచిన త‌ర‌వాత హెచ్ సీ యూ మెల్కోన‌డం స‌హేతుకం కాదు.

నిజంగా ఆ 400 ఎక‌రాల భూమి మాదే అని యూనివ‌ర్సిటీకి న‌మ్మకం ఉంటే..ఈ 400 ఎక‌రాల‌తో పాటు ఎపీ ఎన్జీవోల‌కు కేటాయించిన 134 ఎక‌రాల‌ను  హెచ్ సీ యూ ఎందుకు క్లేయిమ్ చేయ‌డం లేదు? ఒక వేళ క్లేయిం చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ స్టాండ్ ఎంటీ

*సంపినోడే సంతాప స‌భ పెట్టిన‌ట్లు ఉంది బీజేపీ*

తెలంగాణ ఎంపీల తీరు. తెలంగాణ బాగు ప‌ట్టని ఎంపీలు..కంచ గ‌చ్చిబౌలిపై రాద్దాంతం చేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసారు. అయితే స‌గ‌టు తెలంగాణ వాది, ప‌ర్య‌వ‌ర‌ణ ప్రేమికులు అడుగుతున్న ప్ర‌శ్న‌లు..


దేశంలో గ‌త ప‌దేళ‌ల్లో 16 ల‌క్ష‌ల ఎక‌రాల అడ‌విని నాశ‌నం చేసిన అధికార బీజేపీకి కంచ గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాల‌పై మాట్లాడే నైతిక హ‌క్కు ఉందా?

మధ్య భారతదేశానికి లంగ్స్ గా చెప్పుకునే చ‌త్తీస్ గ‌డ్ రాష్ట్రంలోని హస్డియో అడవుల్లోని 10 వేల ఎక‌రాల‌ను అదానీకి క‌ట్ట‌బెట్టిన బీజేపీ నేత‌లు హైద‌రాబాద్ లంగ్స్ గురించి మాట్లాడ‌టం క‌రెక్టేనా?

కార్పొరేట్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి బిజెపి ప్రభుత్వం గడువును 600 రోజుల నుంచి 170 రోజులకు కుదించి ప‌ర్య‌వ‌ర‌ణ నాశ‌నానికి ప‌చ్చ జెండా ఊపి..తెలంగాణ ప్ర‌య‌త్నాల‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?

భారీ ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన.. ప‌ర్యావ‌ర‌ణ అంచ‌నా ప్ర‌క్రియ‌కు తిలోద‌కాలిచ్చిన బీజేపీకి ఇప్పుడు ప‌ర్యావ‌ర‌ణం గురించి మ‌ట్లాడటం స‌హేతుక‌మేనా?

ఆగస్టు 2014లో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (NBWL)లో స్వతంత్ర సభ్యుల సంఖ్యను 15 నుండి 3 కి మోడి ప్ర‌భుత్వం త‌గ్గించింది.  ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసే ప్రాజెక్టుల‌కు క్లియ‌రెన్స్ ఇచ్చే వెసులుబాటును  త‌న గుప్పిట్లో పెట్టుకున్న కేంద్ర ప్ర‌భుత్వం…తెలంగాణలో ప‌ర్యావ‌ర‌ణం గురించి మాట్లాడే హ‌క్కు ఉందా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments