Wednesday, December 11, 2024

సెప్టెంబర్ 5, 2024
వికారాబాద్ జిల్లా.

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో  ఈరోజు జరిగిన గురుపూజోత్సవానికి  ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.

పాల్గొన్న పరిగి,తాండూర్,చేవెళ్ల శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి బి మనోహర్ రెడ్డి , కాలే యాదయ్య, MLC పట్నం మహేందర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా SP నారాయణరెడ్డి, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుకా దేవి ,  ఉన్నతాధికారులు, జిల్లా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు.

● జిల్లా విద్యా శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.

*ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ గారు  తన సందేశంలో…*

మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు విద్యా ప్రాముఖ్యతను గుర్తించి ఎన్నో అద్భుతాలను సృష్టించారన్నారు. ఆ మహానీయులను స్మరించుకుంటూ విద్య పట్ల ఆసక్తిని పెంచాలని సభాపతి తెలిపారు.  మాతృదేవోభవ, పితృదేవోభవ,  ఆచార్యదేవోభవ అనే నానుడి ఉంది అంటే ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయిన తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుందని, సమాజానికి ఉపయోగపడే గురువుకు మన సమాజంలో ఎంతో గుర్తింపు ఉంటుందని, జీవితాలను మలుపుతిప్పే శక్తి గురువులకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  మనకు విద్యాబోధనలు అందించి, మన ఎదుగుదలకు కారకులైన గురువులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ… తను చదువుకున్న రోజుల్లోనీ  జోసెఫ్, లెక్కల మాస్టారును స్పీకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యాబుద్ధులను నేర్పించి ఆర్థికంగా, రాజకీయంగా, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చి దిద్దిన ఘనత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 26 వేల పాఠశాలల్లో 20 లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని, ఇందులో ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకుంటారని ఆయన తెలిపారు.

       విద్యాభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్లో 21 వేల కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని స్పీకర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో 20 ఎకరాలకు స్థలానికి తగ్గకుండా భూములను ఎంపిక చేసి సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని ఆయన అన్నారు.  ప్రైవేటు రంగాలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన అన్నారు.  ప్రభుత్వం విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లేందుకు త్రిసభ్య విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

       రాష్ట్రంలో పరిశ్రమలు నెలకోల్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని, పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు.  ఆడపిల్లలు కూడా విద్య పట్ల ఆసక్తిని పెంచుకోవడంతో పాటు ఉద్యోగాల్లో రాణించేందుకు ముందుకు రావాలని స్పీకర్ సూచించారు.

Previous article
Next article
*ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా*
డిప్యూటీ సి ఏం భట్టి విక్రమార్క మల్లు.
రాష్ర్టంలోని ప్రభుత్వ విద్య సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి  భట్టి విజ్రమార్జమల్లు అన్నారు.
రవీంద్రభారతిలో ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మత్కడుతూ
రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తుందన్నారు.

విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుందనీ పేర్కొన్నారు

ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్య తో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

గత దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో డీఎస్సీ నీ నిర్వహించలేదు.

ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11 062 పోస్టులకు నోటిఫికేషన్ వేయడంతో పాటు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు

రాబోయే రోజుల్లో మరో 6వేల పైబడి పోస్టులకు నోటిఫికేషన్ వేయడానికి భవిష్యత్తు ప్రణాళికను తయారుచేసి ముందుకు పోతున్నామని తెలిపారు

గత పది సంవత్సరాల పాలనలో ఉపాధ్యాయులు పదోన్నతికి, బదిలీలకు నోచుకోలేదనీ విమర్శించారు

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 45 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు చేశాము. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు

ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యా విధానం మారాలని పాఠశాలలో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేసి వాటి నిర్వహణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించి  ప్రభుత్వం 667 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు వివరించారు.

పాఠశాలలో స్వీపర్లు లేకపోవడం వల్ల గురువులే పాఠశాలను క్లీన్ చేసుకోవాల్సిన దుస్థితి గత పాలనలో నెలకొందనీ ఆ పరిస్థితి పోవాలని ఈ ఆర్థిక సంవత్సరం శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు 136 కోట్ల రూపాయలు విడుదలచేసినట్లు చెప్పారు.

ఇప్పటివరకు పరిశ్రమలకు పనికొచ్చే సిలబస్ అందుబాటులో లేకపోవడం వల్ల పరిశ్రమలు అభివృద్ధి కూడా వెనకడుగు పడింది

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను

రాష్ట్రంలో 63 ఐటిఐ కళాశాలలను  అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసి అదునాతన సాంకేతిక విద్యా బోధన అందిస్తున్నాం

గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందినీ

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం 300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందినీ చెప్పారు.

తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీ కి 100 కోట్ల రూపాయలు కేటాయించాం

ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో గురువుల ఆలోచనలు కచ్చితంగా తీసుకుంటాం.

ఉపాధ్యాయులు, గురువులతో  మాట్లాడి చర్చించిన తర్వాతే విధానపరమైన నిర్ణయాలు తయారు చేస్తున్నట్లు వివరించారు
ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ నిర్మాణం కావడానికి గురువుల పాత్ర కీలకంగా ఉపయోగపడాలనీ కోరార్మ్

విద్యా బుద్ధులతో పాటు మంచి అలవాట్లు, సంస్కారం నేర్పించిన మానవ వనరులు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను ఎదుర్కొని సమాజానికి ఉపయోగపడతారు.

సమాజం మనుగడ కోసం పునాదులు వేయాల్సింది గురువులే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 సంవత్సరంలో ప్రభుత్వ బడులలో తెలుగు మీడియం తో పాటు ఆంగ్ల మీడియం చెప్పాలని ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రోత్సహించి ఉపాధ్యాయులు అమలు చేయడం వల్లే నేడు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులు రాణిస్తున్నారనీ అభిప్రాయ పడ్డారు

సమాజ నిర్మాణంలో ప్రపంచంతో పోటీపడే విధంగా మానవ వనరులను తయారు చేయడానికి ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడానికి ఉపాధ్యాయులు సహకరించాలనీ కోరారు.

అభ్యుదయ భావాలతో గురువులు ఉండటం వల్ల ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రం ప్రగతిశీలంగా అభివృద్ధి చెందుతుంది ‌
తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గురువులు గొప్ప వాళ్లు ఉండటం, ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు సంతోషంగా గర్విస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments