Sunday, December 8, 2024

సెప్టెంబర్ 5, 2024
వికారాబాద్ జిల్లా.

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో  ఈరోజు జరిగిన గురుపూజోత్సవానికి  ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.

పాల్గొన్న పరిగి,తాండూర్,చేవెళ్ల శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి బి మనోహర్ రెడ్డి , కాలే యాదయ్య, MLC పట్నం మహేందర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా SP నారాయణరెడ్డి, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుకా దేవి ,  ఉన్నతాధికారులు, జిల్లా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు.

● జిల్లా విద్యా శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.

*ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ గారు  తన సందేశంలో…*

మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు విద్యా ప్రాముఖ్యతను గుర్తించి ఎన్నో అద్భుతాలను సృష్టించారన్నారు. ఆ మహానీయులను స్మరించుకుంటూ విద్య పట్ల ఆసక్తిని పెంచాలని సభాపతి తెలిపారు.  మాతృదేవోభవ, పితృదేవోభవ,  ఆచార్యదేవోభవ అనే నానుడి ఉంది అంటే ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయిన తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుందని, సమాజానికి ఉపయోగపడే గురువుకు మన సమాజంలో ఎంతో గుర్తింపు ఉంటుందని, జీవితాలను మలుపుతిప్పే శక్తి గురువులకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  మనకు విద్యాబోధనలు అందించి, మన ఎదుగుదలకు కారకులైన గురువులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ… తను చదువుకున్న రోజుల్లోనీ  జోసెఫ్, లెక్కల మాస్టారును స్పీకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యాబుద్ధులను నేర్పించి ఆర్థికంగా, రాజకీయంగా, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చి దిద్దిన ఘనత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 26 వేల పాఠశాలల్లో 20 లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని, ఇందులో ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకుంటారని ఆయన తెలిపారు.

       విద్యాభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్లో 21 వేల కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని స్పీకర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో 20 ఎకరాలకు స్థలానికి తగ్గకుండా భూములను ఎంపిక చేసి సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని ఆయన అన్నారు.  ప్రైవేటు రంగాలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన అన్నారు.  ప్రభుత్వం విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లేందుకు త్రిసభ్య విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

       రాష్ట్రంలో పరిశ్రమలు నెలకోల్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని, పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు.  ఆడపిల్లలు కూడా విద్య పట్ల ఆసక్తిని పెంచుకోవడంతో పాటు ఉద్యోగాల్లో రాణించేందుకు ముందుకు రావాలని స్పీకర్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments