*ఫలక్ నూమా ఆర్.ఓ.బి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ ఆమ్రపాలి కాట*
*హైదరాబాద్, సెప్టెంబర్ 05:* ఫలక్ నూమా ఆర్.ఓ.బి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు.
గురువారం కమిషనర్ ఆమ్రపాలి చార్మినార్ జోన్ లో పర్యటించి చేపట్టనున్న ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బండ్లగూడ ఫ్లైఓవర్ జంక్షన్ పనులను పరిశీలించారు. బండ్లగూడ నుండి ఎర్రకుంట వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ, తులసీ నగర్ నుండి గౌస్ నగర్ వయా మైలార్ దేవల పల్లి కాటేదాన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, ట్రిబ్యునల్ నుండి టిప్పు ఖాన్ మజీద్ వరకు, ఇంజన్ బౌలి, బాబా బజార్ నుండి భవాని నగర్ వరకు షేక్ ఫైజ్ కమాన్ నుండి డబీర్ పుర ఫ్లైఓవర్ వరకు ప్రతిపాదిత రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫలక్ నూమాలో చేపట్టనున్న ఆర్.ఓ.బి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ప్రతిపాదిత రోడ్డు విస్తరణ. పనుల కోసం కావల్సిన భూసేకరణ పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సి ఈ దేవానంద్, ఎస్ ఈ దత్తు పంతు, చార్మినార్ జోన్ సిటీ ప్లానర్ మాజిద్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————–
*- సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీ చేయడమైనది.*