Tuesday, December 3, 2024

*ఫలక్ నూమా ఆర్.ఓ.బి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ ఆమ్రపాలి కాట*

*హైదరాబాద్, సెప్టెంబర్ 05:*   ఫలక్ నూమా ఆర్.ఓ.బి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. 

గురువారం కమిషనర్ ఆమ్రపాలి చార్మినార్ జోన్ లో పర్యటించి చేపట్టనున్న ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బండ్లగూడ ఫ్లైఓవర్ జంక్షన్ పనులను పరిశీలించారు. బండ్లగూడ నుండి ఎర్రకుంట వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ, తులసీ నగర్ నుండి గౌస్ నగర్ వయా మైలార్ దేవల పల్లి కాటేదాన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, ట్రిబ్యునల్ నుండి టిప్పు ఖాన్ మజీద్ వరకు, ఇంజన్ బౌలి, బాబా బజార్ నుండి భవాని నగర్ వరకు షేక్ ఫైజ్  కమాన్ నుండి డబీర్ పుర ఫ్లైఓవర్ వరకు ప్రతిపాదిత రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫలక్ నూమాలో చేపట్టనున్న ఆర్.ఓ.బి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 
ఈ సందర్భంగా కమిషనర్ ప్రతిపాదిత రోడ్డు విస్తరణ. పనుల కోసం  కావల్సిన భూసేకరణ  పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సి ఈ దేవానంద్, ఎస్ ఈ దత్తు పంతు, చార్మినార్ జోన్ సిటీ ప్లానర్ మాజిద్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

————————————————————————–
*- సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీ చేయడమైనది.*

Previous article
దిలీప్ కొణతం అరెస్టు అక్రమం

-రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ

-ప్రజా పాలన అంటే ఇదేనా?
-మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం

హైద‌రాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఆయన సూటిగా ప్ర‌శ్నించారు.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం రేవంత్ రెడ్డి దమన నీతికి నిలువెత్తు నిదర్శనం అని ఆయన మండిపడ్డారు.
కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చునుకుంటే అది మీ భ్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత మంది పుట్టుకొస్తారని జీవన్ రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదన్నారు. రేవంత్ రెడ్డి  నిరంకుశ పాలనపై బీఆర్ ఎస్ పోరాడుతుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments