*ఎంపీ వద్దిరాజు సిద్ధిపేట నుంచి నిత్యావసరాలతో కూడి వచ్చిన వహనాలకు స్వాగతం చెప్పారు*
సెప్టెంబర్5.
—————————————-
*ఆపదలో ఉన్న వారికి చేయూత అందించేందుకు బీఆర్ఎస్ ఎల్లవేళలా ముందుంటుందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు*
*మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో వరద ముంచెత్తి ఘోర విపత్తు సంభవించిందన్నారు*
*ఇండ్లు దెబ్బతిని సర్వస్వం కోల్పోయి అష్టకష్టాలు పడుతున్న వారిని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్,సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావులతో కలిసి తాను పరామర్శించి ఓదార్చడం జరిగిందని ఎంపీ రవిచంద్ర వివరించారు.వరద బీభత్సాన్ని,బాధితుల కష్టాన్ని కళ్లారా చూసి చలించిన హరీష్ రావు వారికి తక్షణ సహాయార్థం సిద్ధిపేట నుంచి నిత్యావసరాలతో కూడిన మూడు డీసీఏంలు పంపించారని తెలిపారు*
*ఈ వాహనాలకు గురువారం సాయంత్రం ఎంపీ రవిచంద్ర ఖమ్మం తెలంగాణ భవన్ వద్ద స్వాగతం పలికారు*
*ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు విలేకరులతో మాట్లాడుతూ,ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, ఇటువంటి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు తమ బీఆర్ఎస్ శ్రేణులు సహాయక చర్యల్లో ముందుంటాయని చెప్పారు*
*ఇందులో భాగంగా సోమ,మంగళ, బుధవారాలు బాధితులకు నిత్యావసర సరుకులు అందించామని పేర్కొన్నారు.హరీష్ రావు పంపిన నిత్యావసర సరుకులు, బ్రెడ్ ప్యాకెట్స్, దుప్పట్లు ఖమ్మం,పాలేరు నియోజకవర్గ పరిధిలోని వరద బాధితులకు పంపిణీ చేస్తామన్నారు*
*తమ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక నెల జీతాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు*
*రాజ్యసభలో తన సహచర సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థసారథి రెడ్డి వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు అందజేశారని తెలిపారు*
*హరీష్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రముఖులంతా వరద బాధితులను పరామర్శిస్తున్న సందర్భంగా దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా బీఆర్ఎస్ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తీవ్ర విచారకరమని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు*
*ఈ విపత్తు నుంచి ప్రజలు త్వరితగతిన కోలుకోవాలని ఎంపీ వద్దిరాజు మనసారా ఆకాంక్షించారు*
*ఎంపీ రవిచంద్రతో కలిసి విలేకరుల సమావేశంలో పార్టీ ప్రముఖులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం,బమ్మెర రాంమూర్తి, తోట రామారావు,బెల్లం వేణు,తోట వీరభద్రం తదితరులు పాల్గొన్నారు*
*ఈ సందర్భంగా “జై తెలంగాణ జై జై తెలంగాణ”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”, “వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినదించారు*