న్యూస్ అలెర్ట్:
===========
*జంట జలాశయాల గేట్లు ఎత్తివేత*, మూసి నదీ పరివాహక ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేసిన జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి కాట*.
ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు వరద నీరు ఇన్‌ఫ్లో కారణంగా రెండూ పూర్తి ట్యాంక్ స్థాయికి (FTL) చేరుకుంటున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా జలమండలి ఇవాళ(శనివారం) సాయంత్రం 5 గంటలకు ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను ఒక ఫీటు పైకి, హిమాయత్‌సాగర్ ఒక గేట్ ఒక ఫీటు పైకి ఎత్తి నీటిని దిగువన ఉన్న మూసీ నదిలోకి వదలనుంది.
ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ఒక్కో అడుగు మేర ఎత్తితే 226 క్యూసెక్కుల ఔట్ ఫ్లో.. హిమాయత్ సాగర్ ఒక అడుగు ఎత్తుతో ఒక గేటు ఎత్తితే 340 క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది.
జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నందున.. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సంబంధించిన అధికారులు, హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.
1. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం – 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి – 1761.10 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం – 2.970 టీఎంసీ లు
ప్రస్తుత సామర్థ్యం – 2.455 టీఎంసీ లు
2. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం – 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి – 1787.95 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం – 3.90 టీఎంసీ లు
ప్రస్తుత సామర్థ్యం – 3.430 టీఎంసీ లు