Tuesday, June 10, 2025
HomeUncategorizedయు పి యస్ సీ మెయిన్స్ లో విజయం సాధించడానికి మానసికంగా సిద్ధం కావాలి

యు పి యస్ సీ మెయిన్స్ లో విజయం సాధించడానికి మానసికంగా సిద్ధం కావాలి

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

యుపిఎస్సి మెయిన్స్ లో విజయం సాధించడానికి మానసికంగా  సిద్ధం
కావాలి

మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఇష్టగోష్టి –

హైదరాబాద్ సెప్టెంబర్ 07(సమయం న్యూస్) యుపిఎస్సి మెయిన్స్ లో విజయం సాధించడానికి మానసికంగా  సిద్ధం
కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

.    శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ లో యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న
అభ్యర్థులతో నిర్వహించిన ఇష్టగోష్టి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.2023-24 సంవత్సరంలో 27 మంది అభ్యర్థులు ఫిలిమ్స్ ఎగ్జామినేషన్స్ లో క్వాలిఫై అయి 21 సెప్టెంబర్2024 రోజున నిర్వహించనున్న మెయిన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులతో టీఎస్ ఎస్సీ స్టడీ సెంటర్లో జిల్లా కలెక్టర్ ఇంట్రాక్ట్
అయినారు.  ఈ సందర్భంగా ఆయన  ప్రిలిమ్స్ క్లియర్ చేసినందుకు అభ్యర్థులను అభినందించారు. వివిధ అంశాలపై అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చి మార్గదర్శకత్వం మరియు ప్రేరణ కల్పించారు. అభ్యర్థులు ప్రతి సబ్జెక్టు విశ్లేషించి, ప్రశ్నలను అంచనా వేసి సిద్ధం చేసుకొని మంచి మార్కులు స్కోర్ చేయడానికి సబ్జెక్ట్ పై పూర్తిగా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి ప్రశ్నకు రాయడానికి సమయ పరిమితిని  చేసుకోవాలన్నారు. అభ్యర్థులు అడిగిన సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎస్సి స్టడీ సెంటర్ హైదరాబాద్ డైరెక్టర్ ఏ నరసింహారెడ్డి, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ సర్వయ్య, లైబ్రరీయన్ ఫిలిమ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments