*_యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం…_*
*_12మంది దుర్మరణం_*
*_ఉత్తరప్రదేశ్ లో రహదారి రక్తదాహం పలువురిని బలిగొంది. యూపీలోని హత్రాస్ లో ఓ బస్సును లోడర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ముందు వెళుతున్న బస్సును లోడర్ వాహనం ఓవర్ టేక్ చేయబోయిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది._*
*_మరణించిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. ఆగ్రా-అలీగఢ్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా, వారిని సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు._*