Wednesday, February 5, 2025
HomeUncategorized*70 ఏండ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.*

*70 ఏండ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.*

*70 ఏండ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.*

*ఆదాయం, సామాజిక స్థితి, వృత్తితో సంబంధం లేకుండా ఆయుష్మాన్‌ భారత్*

*ఏమిటీ పథకం?*

*దేశంలో 70 ఏండ్లు, ఆపైబడిన వయసు వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా కవరేజీ ఇవ్వడమే ఏబీపీఎంజేఏవై-సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌ లక్ష్యం.*

*ఎవరు అర్హులు?*

*ఈ పథకంలో చేరడానికి ఆర్థిక స్థోమత, సామాజిక స్థితి, వృత్తి ఇలా ఏ అంశాలనూ పరిగణనలోకి తీసుకోరు.*

*70 ఏండ్ల వయసు పైబడిన పురుషుడు, మహిళ ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు.*

*ఏయే పత్రాలు సమర్పించాలి?*

*వయసు ధ్రువీకరణ కొరకు ఆధార్‌ కార్డు ఒక్కటి ఉంటే చాలు*.

*మరే ఇతర పత్రాలు అవసరం లేదు*.

*దరఖాస్తు ఎలా చేసుకోవాలి?*

*https://beneficiary*. *nha.gov.in/*

*పోర్టల్‌ ద్వారా పీఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేయవచ్చు.*

ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆయుష్మాన్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

*పథకంలో చేరినట్టు రుజువేంటి?*

పథకంలో చేరినవారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్‌ వయ వందన కార్డును అందజేస్తారు.

*డిజిటల్‌ కార్డులూ అందుబాటులో ఉన్నాయి*.

*ఎక్కువ మంది ఉంటే నమోదు ఎలా?*

*ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే, మొదటి వ్యక్తి వివరాలను ముందుగా నమోదు చేయాలి*.

*ఆ తర్వాత ‘యాడ్‌ మెంబర్‌’పై క్లిక్‌ చేసి మరొకరి వివరాలను నమోదు చేయాలి.*

*ఒక్కొక్కరికి వేర్వేరుగా నమోదు చేయనక్కర్లేదు*.

*కుటుంబంలో ఎక్కువ మంది వృద్ధులు ఉంటే?*

*ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులైన వృద్ధులు ఉంటే, వారంతా కలిసి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు.*

*ఉదాహరణకు ఒక కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం చేకూరుతుంది*.

*అంటే, కుటుంబానికి రూ.5 లక్షల వరకు మాత్రమే లబ్ధి పొందడానికి వీలవుతుందన్న మాట*.

*ఇప్పటికే కుటుంబం ఆయుష్మాన్‌ స్కీమ్‌లో నమోదై ఉంటే?*

ఇప్పటికే ఆయుష్మాన్‌ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లో 70 ఏండ్లు,
ఆ పైబడిన వారుంటే.. వారికి అదనంగా ఏడాదికి రూ.5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది.

*ఈ స్కీమ్‌లో ఎన్ని దవాఖానలు ఎన్‌రోల్‌ అయ్యాయి?*

*నవంబర్‌ 1 వరకు ఉన్న డాటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 16,691 ప్రభుత్వ దవాఖానలు, 13,078 ప్రైవేటు దవాఖానలు ఈ పథకం కింద నమోదయ్యాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments