Sunday, December 8, 2024
HomeUncategorizedజర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి*

జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి*

*ఆదివారం నాడు (8 .9 .2024 ) జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి*
*38 ఎకరాల భూమి అందచేయనున్న సి.ఎం*.
*మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష అందచేత*


     హైదరాబాద్, సెప్టెంబర్ 7 ::(సమయం న్యూస్) సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు తమ నివాస స్థలాలకై ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం ఖరారైంది. రేపు (8 . 9 .2024 ) న ఉదయం 10 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై జవహర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ కి 38 ఎకరాల భూమిని అందచేయనున్నారు. *ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం* అనే పేరుతొ నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌరసంబందాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి లతో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
        రాష్ట్రంలో విధినిర్వహణలో, వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు.
        రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఎం. హనుమంత రావు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజి ఇస్తున్నందున ప్రెస్ ఫోటో, వీడియో గ్రాఫ్ చేయడానికి అనుమతించడంలేదని, ఇందుకు సహకరించాల్సిందిగా తెలిపారు.
——————————————————————————————————————

Previous article
*ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఈ చుక్కలతో సత్వారం మాయం..*

*15నిమిషాల్లోనే ప్రభావం.. అత్యంత చవగ్గా అందుబాటులోకి!*

*అభివృద్ధి చేసిన ముంబై సంస్థ ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్*

*’ప్రెసు’ ఐడ్రాప్స్ పేరుతో అందుబాటులోకి..*

*ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మందికి ఇది శుభవార్తే కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాల్లోనే ప్రభావం*

*కేవలం రూ.350కే అందుబాటులోకి*

రీడింగ్ గ్లాసులకు ఇక చెల్లుచీటి చెప్పేయండి.సరికొత్త ఐడ్రాప్స్ త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ దీనికి కేవలం రూ.350కే అందుబాటులోకి అనుమతులు మంజూరు చేసింది.ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ప్రిస్బియోపియా (దృష్టిదోషం) చికిత్స కోసం ‘ప్రెసు’ ఐడ్రాప్స్ను అభివృద్ధి చేసింది. ప్రిస్బియోపియాతో ప్రపంచవ్యాప్తంగా 109 కోట్ల నుంచి 180 బిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ డ్రాప్స్ ఎంతగానో మేలుచేయనున్నాయి.ఇది వయసుతో పాటు వచ్చే సమస్య. సాధారణంగా 40 ఏళ్ల వయసులో మొదలవుతుంది. 60 ఏళ్లు వచ్చే సరికి సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్య ఉన్నవారికి దగ్గరి వస్తువులు సరిగా కనిపించవు. ఇప్పుడీ డ్రాప్స్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ తినిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు డీసీజీఐ తాజాగా ప్రెస్వు డ్రాప్స్కు అనుమతులు మంజూరు చేసింది.దృష్టిదోషం ఉన్న వారిలో రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించేందుకు రూపొందించిన దేశంలోనే తొలి కంటి చుక్కలు ఇవేనని కంపెనీ పేర్కొంది. తాజాగా కంపెనీ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాలకే ప్రభావం కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రిస్కిప్షన్ ఆధారంగా మార్కెట్లో ఈ ఐడ్రాప్స్ కేవలం రూ.350కే లభిస్తాయని కంపెనీ తెలిపింది.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments