కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ.
అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం
కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్ పాస్ ఫ్లై ఓవర్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్
కెబిఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ 45, ఫిలింనగర్, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం లవైపు అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టేందుకు జి హెచ్ ఎం సి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో కే బి అర్ చుట్టూ ఉన్న జంక్షన్ లలో ట్రాఫిక్ రద్ది లేకుండా 826 కోట్ల వ్యయంతో 6 జాంక్షన్ లా ను నిర్మించనున్నారు , ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర అభివృద్ధి కి 826 కోట్ల ను మంజూరు చేసింది దీంతో నగరంలో రోడ్ల అభివృద్ధికి గత ప్రభుత్వం లాగానే కట్టుబడి ఉన్నట్లు తేట తెల్లం అయ్యింది. అరు జంక్షన్ రెండు దశల్లో చేపట్టనున్నారు మొదటి దశలో 421 కోట్ల రూపాయల వ్యయం తో జూబ్లి హిల్స్, చెక్ పోస్టు కే బి అర్ పార్కు ఎంట్రన్స్ , ముగ్ధ జంక్షన్ అండర్ పాసలు ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు.
రెండో దశలో 405 కోట్ల వ్యయంతో రోడ్డు నంబర్ 45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రాసేన్ జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లలో ఫ్లై ఓవర్, అందర్ పాస్ ల నిర్మాణాలు చేపట్టనున్నారు సవ్య దిశలో వెళ్లేందుకు అండర్ పాసులు, అపసవ్య దిశలో వెళ్లేందుకు ఫ్లై ఓవర్ లా నిర్మాణాలు జరగనున్నాయి. అండర్ పాస్ లో వర్షపు నీరు లేకుండా నిర్మానాల డిజైన్ చేసారు దీంతో సిగ్నల్ రహిత రవాణా సౌకర్యం
మాదాపూర్, హై టెక్ సిటి, గచ్చిబౌలి కొండాపూర్ వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య లేకుండా సకాలంలో గమ్యస్థానానికి వెళ్లేందుకు వెసులు బాటు కలదు..