Thursday, December 26, 2024
HomeUncategorizedఅంగన్వాడీ కేంద్రాల్లో  కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయండి .

అంగన్వాడీ కేంద్రాల్లో  కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయండి .


ముర్రు పాల ఆవశ్యకత పై అవగాహన కల్పించాలి.

తల్లి బిడ్డల సంక్షేమం కోసం పోషణ అభియాన్.
*పోషణ అభియాన్ లో కిశోర బాలికల రక్తహీనత నిర్మూల చర్యలు చేపట్టాలి.

*గర్భిణీ స్త్రీలకు ముర్రుపాల ఆవశ్యకత మీద అవగాహన కల్పించాలి.

*జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి.

సంగారెడ్డి సెప్టెంబర్20( సమయం న్యూస్)
       పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లి, బిడ్డలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు  అన్నారు.
    
శుక్రవారం కలెక్టరేట్  ఆడిటోరియంలో   మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ్ అభియాన్  కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు,స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ చంద్రశేఖర్  లు  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని  ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకు పోషకాహారం కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకునేలా వారిని చైతన్య పరచాలన్నారు.
జిల్లాలో ఈ నెల ఒకటి నుండి 30 వరకు నిర్వహిస్తున్న జాతీయ పోషణ మాసంలో సిబ్బంది, ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల పోషణ, పోషకాహారం,  పరిశుభ్రతపై వివరించాలన్నారు. జిల్లాలోని 1504 అంగన్వాడి కేంద్రాలలో పోషణ అభియాన్ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని, తల్లి, బిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిరోజు గర్భిణీలకు, బాలింతలు, పిల్లలకు పాలు, గుడ్లు, పోషక విలువలు కలిగిన హారాన్ని అందించాలన్నారు. అంగన్వాడి, ఆశ, వైద్య సిబ్బంది సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పోషణ, ఆరోగ్య శుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు మురుపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించేలాచూడాలన్నారు. ముర్రుపాలు తాపడం వలన  పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు, రోగనిరోధక శక్తి పెంపొందించుకుంటారని తెలిపారు. పోషణ లోపం కలిగిన పిల్లలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని ఆరోగ్యవంతులుగా మార్చేలా చర్యలు చేపట్టాలన్నారు., ప్రతి చిన్నారి వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా పోషక ఆహారాన్ని అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రక్తహీనత లోపం లేకుండా గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషణ విలువలు ఉన్న  ఆహారం తీసుకోవడంతో పాటు రాగులు, జొన్నలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు వంటివి తీసుకోవాలని  సూచించారు. వాటిపై అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని మహిళా శిశు సంక్షేమ అధికారిణి ని ఆదేశించారు.
అంగన్వాడి కేంద్రాలలో కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.
    అనంతరం గర్భిణులు, బాలింతలు, అంగన్వాడి, వైద్య శాఖ సిబ్బందిచే కలెక్టర్ పోషణ అభియాన్ కార్యక్రమం అమలుపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే గర్భిణీ స్త్రీలకు  సామూహిక  శ్రీమంతం, చిన్నారులకు అక్షరబ్యాస కార్యక్రమం, అన్నప్రాస కార్యక్రమం నిర్వహించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  చంద్రశేఖర్ మాట్లాడుతూ, 7 వ జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు, అంగన్వాడి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమం,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ తల్లి బిడ్డల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు.    అంతకుముందు వివిధ అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ప్రదర్శించిన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరిశీలించారు.


ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారిణి  డా ‘గాయత్రీ దేవి  , జిల్లా విద్యాశాఖ అధికారి  వెంకటేశ్వర్లు,  మెప్మా పిడి గీత,  సిడిపిఓలు,  సూపర్వైజర్లు, అధికారులు,  అంగన్వాడి సిబ్బంది, గర్భిణీలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments