ప్రయాణిస్తున్న కారులో ప్రమాద ఘటన
*ప్రయాణిస్తున్న కారులో..అగ్నిప్రమాదం..*
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి- నార్కెట్పల్లి రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. మంటలు గమనించి కారులో ఉన్న ప్రయాణికుడుని స్థానికులు అద్దాలు పగులకొట్టి బయటికి తీశారు. గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న ప్రయాణికున్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.