బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయనం లో భాగంగా 40 మంది కార్పొరేటర్ల తో కలిసి లక్నో పర్యటన లో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి నీ కలిసిన మేయర్ బృందం
*లక్నో స్మార్ట్ సిటీ ని సందర్శించిన హైదరాబాద్ మేయర్ బృందం*
*హైదరాబాద్, సెప్టెంబర్ 23:* లక్నో కార్పొరేషన్ లలో బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయన పర్యటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 40 మంది కార్పొరేటర్లతో కలిసి సోమవారం లాల్ బాగ్ లోని లక్నో స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ మూడు కమాండ్ సెంటర్లలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను మేయర్ బృందం పరిశీలించింది.
*సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కమాండ్ సెంటర్:* బ్యాటరీతో నడిచే ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్నట్లు, ప్రతి కాలనీలో షెడ్యూల్ సమయం మేరకు నిర్దేశించిన రూట్ లలో ఆటోలు వెళ్లేలా ఆటోల కదలికలను సిస్టం కంట్రోల్ రూం నుండి పర్యవేక్షిస్తున్నట్లు పరిశీలించారు. ఆటోలు వెళ్లనట్లైతే గుర్తించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధిత సూపర్వైజర్ ను అక్కడకు పంపి వాకీటాకి ద్వారా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా ఆటోల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారని, తడి, పొడి చెత్తను విడిగా ఇచ్చేలా సంబంధిత ఏజెన్సీ పౌరులకు అవగాహన కల్పిస్తున్నట్లు గమనించారు.
*సేఫ్ సిటీ కమాండ్ సెంటర్:* మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతున్నారు. ఈ కమాండ్ సెంటర్ లో ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, స్త్రీల పై వేధింపులు, అత్యాచారాలు జరగకుండా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు గుర్తించారు. వివిధ నగర కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి A1 ఆధారిత సాఫ్ట్ వేర్ సిస్టం ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఏవేని అనుమానిత సంఘటనలు దృష్టిలోకి వచ్చినట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించి వాటిని నియంత్రిస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో కూడా కెమెరాలు ఉన్నాయని, మహిళలకు ఏదేని సహాయం అవసరమైతే పానిక్ బటన్ ను నొక్కినట్లైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది వెంటనే స్పందించి వారికి సహాయం అందిస్తున్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా ఒక బస్ లో ప్రయాణికులు ఎక్కుతుండగా ఆ డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతుండటం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గమనించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని డ్రైవర్ తో మాట్లాడాలని కోరగా వెంటనే సంబంధిత సిబ్బంది డ్రైవర్ కు ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేసి బస్సు నడుపుతూ ఫోన్ మాట్లాడటం చేయకూడదని హెచ్చరించడంతో డ్రైవర్ స్పందించి తక్షణం ఫోన్ ఆఫ్ చేశారని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చాలా బాగా ఆకట్టుకుందని అన్నారు. కెమెరా రిజల్యుషన్ (ఫోకస్) చాలా ఎక్కువగా ఉందని, వాహనం నంబర్, వాహనంలో వ్యక్తులు తీసుకువెళ్లే బాటిళ్లలో ఉండే ద్రవం తదితర స్థాయిలో పర్యవేక్షణ ఉన్నట్లు గమనించారని, ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు గుర్తించామని మేయర్ తెలిపారు.
*ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమాండ్ సెంటర్:* అన్ని ట్రాఫిక్ జంక్షన్లను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అనంతరం మేయర్, కార్పొరేటర్ల బృందం యూపీ దర్శన్ పార్క్ గా పిలువబడే వేస్ట్ టూ వండర్ పార్కును సందర్శించారు. ఈ పార్కులో ఇనుప తుప్పు, నాలుగు చక్రాల స్క్రాప్ లు, రోలింగ్ షెటర్లు వంటి వ్యర్థ పదార్థాలతో నిర్మించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్నో కార్పొరేషన్ అధికారులు బారా ఇమాంబారా, లక్నో విధాన సభ, ఝాన్సీ పోర్ట్, మధుర లోని బాంకే బిహారి, బృందావన్ దేవాలయాలు, బలరాంపూర్ లోని దేవి పటన్ మందిర్, తాజ్ మహాల్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, దుద్వ నేషనల్ పార్కు వంటి స్మారక చిహ్నాల నమూనాలను ఈ పార్కులో నిర్మించనున్నట్లు మేయర్ బృందానికి తెలిపారు.
ఆయా విధానాలు బాగున్నాయని, నగరాల్లో స్వచ్ఛత పురోగతి సాధించడంతో పాటు మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో స్వచ్ఛ నగరాలుగా తీర్చిదిద్దవచ్చని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు కార్పొరేటర్లు కక్కిరేని చేతన, కొంతం దీపిక, బండారు శ్రీవాణి, డా.బి.సురేఖ, సి.రాజ్యలక్ష్మి, జె.శ్వేత, బి.భాగ్యలక్ష్మి, కొప్పుల నర్సింహారెడ్డి, తోకల శ్రీనివాస రెడ్డి, కె.రవికుమార్, ఏ.భాగ్యలక్ష్మి, చీర సుచిత్ర, వంగ మధుసూదన్ రెడ్డి, గున్నాల సునిత, కొత్తకాపు అరుణ, సి.హెచ్.అరుణ, రాకేష్ జైస్వాల్, ఎం.సంగీత, ఊరపల్లి శ్రావణ్, చెరుకుపల్లి తార చంద్రారెడ్డి, మచ్చనపల్లి సుప్రియ, కె.నవజీవన్ రెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి, జె.ప్రభుదాసు, దేవేందర్ రెడ్డి పన్నాల, దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, సి.ఎన్. రెడ్డి, రాగుల వెంకటేశ్వరరెడ్డి, బానోతు సుజత, వి.జగదీశ్వర్ గౌడ్, ఎస్.స్వర్ణరాజ్, బి.పూజిత, రాగం నాగేందర్ యాదవ్, వనం సంగీత యాదవ్, షేక్ హమీద్, మహాలక్ష్మి రామన్ గౌడ్, ఎం.రజిత, ఓ.ఎస్.డి విజయ్ కృష్ణ, ఇండోర్ లక్నో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఎస్.డబ్ల్యూ.ఎం) ఆర్. శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు