Thursday, November 21, 2024
HomeUncategorizedనాలుగు గంటల్లో హైదరాబాద్ నుండి విశాఖ పట్టణం.

నాలుగు గంటల్లో హైదరాబాద్ నుండి విశాఖ పట్టణం.

*నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం*

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలులో వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుంది.. కనీసం వందే భారత్‌లో వెళ్లినా 8 గంటలు పడుతుంది. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో అయితే మరో మూడు నుంచి నాలుగు గంటలు అదనం. కానీ కేవలం నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవచ్చు. దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యచరణను ప్రారంభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) వరకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్‌ను రైల్వే శాఖ ఖరారు చేసింది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ లైన్‌ను ప్రతిపాదించారు. దీనిలో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు. ఈ రైల్వే కారిడార్ విశాఖపట్నం నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వే తుది దశకు చేరుకుంది. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను నవంబర్‌లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

*మొదటి సెమీ హైస్పీడ్ కారిడార్..*

ఈ కారిడార్ పనులు మొదలైతే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ ఇదే కానుంది. ఈ రూట్‌లో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళికను రూపొందించారు. ఈ రైలు మార్గం విమానాశ్రయాలకు అతి సమీపం నుంచి వెళ్లనుంది. విమాన ప్రయాణీకులు సెమీ హైస్పీడ్ రైళ్లలో తాము చేరుకోవల్సిన గమ్యానికి త్వరగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ సెమీ హైస్పీడ్ రైలు వేగం గంటకు 220 కి.మీ ఉండనుంది. అంటే వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటలలోపే ఈ ట్రైన్ చేరుకుంటుంది. ఈ రైలు మార్గం పూర్తయితే  మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు అతి వేగంగా చేరుకోవచ్చు. ఈ రైలు ప్రాజెక్టు పూర్తయితే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్టణానికి నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్టణం మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. అదే వందే భారత్ రైలులో 8.30 గంటల్లో చేరుకుంటుంది.

*అత్యంత వేగంగా..*

ఇప్పటివరకు ఉన్న రైళ్ల గరిష్ట వేగం 110 నుంచి 130 కిలోమీటర్లకు మించి లేదు. గరిష్ట వేగంతో రైళ్లు ప్రయాణించే సందర్భాలు చాలా తక్కువుగా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం రెండు రైలు మార్గాలు ఉన్నాయి. ఒకటి వరంగల్, ఖమ్మం, విజయవాడ కాగా.. రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ మీదుగా విశాఖ చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రైలు మార్గాల్లో ప్రయాణిస్తే విశాఖకు కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. కొత్త రైల్వే కారిడార్ నిర్మాణం పూర్తైతే శంషాబాద్- విశాఖ (దువ్వాడ) మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే సెమీ హైస్పీడ్ రైలు రెట్టింపు వేగంతో నడవనుంది. దీంతో గమ్యస్థానాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది.. హైదరాబాద్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments