*రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్*
రైలులో సీటు లేదా బెర్త్ దక్కని ప్రయాణికులు ఆఖరి నిమిషంలో అంటే చార్ట్ తయారైన తర్వాత కూడా సీటు పొందే అవకాశం రైల్వేశాఖ కల్పిస్తోంది. ఖాళీ బెర్త్ల గురించిన సమాచారాన్ని రైల్వే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లో అందిస్తోంది. మొదటిసారి హాజీపూర్ రైల్వే జోన్లో ఈ సదుపాయం ప్రారంభమైంది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని జోన్ పరిధిలోని 5రైల్వే డివిజన్ల లోనూ ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో ఇస్తున్నారు.
*అత్యంత పొడవైనా రైలు మార్గం — వివేక్ ఎక్స్ ప్రెస్*
*అస్సాం — కన్యాకుమారి*
వివేక్ ఎక్స్‌ప్రెస్ భారతదేశం లోనే అత్యంత పొడవైన రైలు మార్గంగా పేరు గాంచింది.దీని ప్రయాణం అస్సాం రాష్ట్రం లోని దిబ్రూఘర్ నుండి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు దాదాపు 4,200 కి.మీ.
వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు వారానికోసారి నడుస్తుంది మరియు దాని మార్గాన్ని పూర్తి చేయడానికి సుమారు 80 గంటలు పడుతుంది.ఈ రైలు ప్రయాణ మార్గంలో 50 స్టాప్‌లు ఉంటాయి.
వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుండి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశం యొక్క విభిన్న భౌగోళిక దృశ్యాలను మనకు కనువిందు చేస్తుంది.