Thursday, November 21, 2024
HomeUncategorizedర్యాంగింగ్ భాధ్యుల పై చర్యలు: మంత్రి దామోదర రాజనర్సింహ.

ర్యాంగింగ్ భాధ్యుల పై చర్యలు: మంత్రి దామోదర రాజనర్సింహ.



ర్యాగింగ్ బాధ్యులపై చర్యలు
ఖమ్మం ఘటనపై మంత్రి దామోదర రాజ నర్సింహ ఆగ్రహం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
ర్యాగింగ్ పేరిట భవిష్యత్ పాడుచేసుకోవద్దని విద్యార్థులకు సూచన

• మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు.
• ఈ అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు‌.
• ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
• ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
• ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారం తీసుకోవాలన్నారు.
• ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.
• తమ జూనియర్లతో  సీనియర్ స్టూడెంట్స్‌ ఫ్రెండ్లీగా ఉండాలి తప్పితే, ర్యాగింగ్ పేరిట వారిని భయాందోళనకు గురి చేయొద్దన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments