SPECIAL STORY WITH BHATT I., Dy.CM
ఆర్థిక క్రమశిక్షణతో విధ్వంసం నుంచి వికాసం దిశగా
ఖాళీ ఖజానా చేతికి ఇచ్చిన గత ప్రభుత్వం
భట్టి విక్రమార్క చేతిలో ఖజానా పదిలం
ఆర్థికశాఖను గాడిలో పెట్టిన భట్టి
ఆరు హామీల అమలులో భట్టి కీలక పాత్ర
నీళ్ళు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ సమాజం కోరి కొట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాడు మిగులు బడ్జెట్ ఉండగా, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల జాడ లేకపోగా 7 లక్షల కోట్ల అప్పు మిగిలింది. గత పాలకుల పదేళ్ల పాలనలో వందేళ్ల ఆర్ధిక విధ్వంసాన్ని సృష్టించారు. ప్రజల డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. జమా లెక్కలు చూపకుండా పాలనకు పాతర వేశారు. రాష్ట్రం అంధకారబంధురమైన సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క ఏడాది పాలనలో అద్భుత విజయాలు సాధించారు. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు.
ఈ రాష్ట్ర సంపద ఏ కొందరికో పరిమితం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పైసా పేదలకు పంచాలి… సమాజంలో అంతరాలను తగ్గించాలి… అనే సిద్దాంతాన్ని నమ్మి తూచ తప్పకుండా పాటిస్తూ తన ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన, ప్రణాళికా శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క. సంపద సృష్టిస్తాం, సంపద పంచుతాం అంటూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన ప్రజాస్వామ్యం, సామ్యవాద భావజాలాన్ని అణువణువునా నింపుకున్న డిప్యూటీ సీఎం ఆచరణలో అక్షరాల పాటిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆర్ధిక విధ్వంసం నుంచి వికాసం వైపు వ్యవస్థను క్రమంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఓ వైపు గత పాలకులు చేసిన అప్పులకు అసలుతో పాటు వడ్డీలు చెల్లిస్తూనే మరోవైపు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకి లేకుండా ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీల అమల్లో ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషిస్తున్నారు. అసెంబ్లీలో శ్వేత పత్రం ప్రవేశపెట్టడం ద్వారా ఆడిట్ రిపోర్టులు సభ ముందు ఉంచి ఆర్థిక పాలనలో పారదర్శకతను చాటుతున్నారు. అవినీతి, బంధుప్రీతి, దుబారా వంటి అంశాలకు తావు లేకుండా గత చరిత్రను తిరగరాస్తూ భారతదేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా నిలిపే పనిలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక, ఇంధణ, ప్రణాళికశాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ… రోజుకు 16 గుటం పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆశ్రమ ఫలితంగానే ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రం ఊహకు కూడా అందని ఆర్థిక విజయాలు సాధించింది.
ఆర్థిక శ్వేత పత్రం
2023 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రాష్ట్రా ఆర్థిక పరిస్థితులపై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న విక్రమార శ్వేత పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి 10 ఏళ్లలో వందేళ్ల ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. గత ప్రభుత్వం ఆర్థిక శాఖ నిర్వహణలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయలేదు. దీంతో గత ప్రభుత్వం ఆర్థిక పరిపాలనలో చేసిన తీవ్ర తప్పిదాలను, భవిష్యత్ అవసరాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వంటి వాస్తవ ఆర్థిక పరిస్థితులను ప్రజులు ముందు పెట్టాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో భట్టి ఆర్థిక శ్వేత పత్రం ప్రవేశ పెట్టారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఆర్థిక పరిపాలను పారదర్శకతను తీసుకువచ్చే దిశగా శ్వేతపత్రం తోడ్పడింది.
2024-25 బడ్జెట్ ఆమోదం
పాలన అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర శాసనసభలో మొదటి నాలుగు నెలల తాత్కాలిక బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అనంతరం ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తిస్థాయిలో 2024-25 సంవత్సరానికి ఆయన బడ్జెట్ సమర్పించి ఆమోదం పొందారు. గత ప్రభుత్వం నిధుల దిర్వినియోగం ప్రణాళికలు సరిగ్గా అమలు చేయడంలో విఫలమవ్వడం వల్ల సమస్యలు తలెత్తాయి, ఈ పరిస్ధితులను ప్రస్తుత ప్రభుత్వం సరిచేసే ప్రయత్నాలు చేసింది. ఈ దిశగా ఇచ్చిన హామీలన్నీ నిరవేర్చడంలో ప్రజా ప్రభుత్వం నిబద్ధతని పాటిస్తోంది.
సకాలంలో జీతాలు విడుదల
మార్చి 2024 నుంచి ప్రతి నెలా 1వ తేదీన 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు, 2,88,000 మంది పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో చెల్లించడం ప్రారంభమైంది. గతంలో జీతాలు, పెన్షన్లు ఆలస్యంగా చెల్లించబడటం వలన ఉద్యోగులు, పెన్షనర్లకు ఎదురైన ఇబ్బందులను పరిష్కరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని ఉద్యోగులపట్ల తమకున్న చిత్తశుద్ధిని ప్రజా ప్రభుత్వం ప్రదర్శించింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెలా మొదటి తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో నమోదు చేస్తూ ఆర్థిక మంత్రి ఆర్థిక సవాళ్లతో చేస్తున్నారు.
16వ ఆర్థిక సంఘం పర్యటన
2024 సెప్టెంబర్లో 16వ ఆర్థికసంఘం తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించింది. ఆర్థిక సంఘం సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్ధితులు, ఆదాయం, వ్యయం, ప్రజా సంక్షేమ పథకాలు, వివిధ అభివ్రుద్ది కార్యక్రమాలు వాటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద ఉన్న ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క ముల్లు వివరించిన తీరును ఆర్థిక సంఘం ప్రశంసించింది. గత ప్రభుత్వాలు సరైన ఆర్థిక ప్రణాళికలు తయారు చేయడంలో విఫలమవ్వడం వల్ల రాష్ట్రానికి గణనీయమైన నష్టం జరిగిందని ఈ ప్రదర్శనలో వారు ఇరువురు పునరుద్ఘాటించారు.
రుణాల పొదువు, తిరిగి చెల్లింపు
2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు ప్రభుత్వం రూ.51,118 కోట్లు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వ రుణాలపై వడ్డీతో పాటు రూ.59,509 కోట్లు తిరిగి చెల్లించింది. గత ప్రభుత్వాల అవసరం లేని రుణాల కారణంగా నేడు ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆ రుణాలను తీర్చడానికి నిధులు ఖర్చు చేయాల్సిన దుస్ధితి ఏర్పడింది. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా ప్రజా ప్రభుత్వం చేసిన అప్పు కన్నా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయినా ఏమాత్రం తొట్రుపాటుకు గురికాకుండా భట్టి విక్రమార్క ముందుకు తీసుకువెళుతున్నారు.
ఫ్లాగ్ షిప్ స్కీములకు నిధుల కేటాయింపు
ప్రజా ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ప్రధాన సంక్షేమ పథకాలకు రూ.56,486 కోట్లను కేటాయించి ప్రాజెక్టులను ముందుకు నడిపించింది. ఇందులో రైతు భరోసా, రైతు రుణమాఫీ, చేయూత, ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు సంబంధించిన ఇతర ముఖ్య పథకాలు ఉన్నాయి. గత ప్రభుత్వం హేతుబద్దమైన విశ్లేషణ లేకుండా అనేక పథకాలను ప్రతిపాదించి వాటిని సరిగా అమలు చేయకపోవడం వలన ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రస్తుత ప్రభుత్వం ఈ కేటాయింపుల ద్వారా సరి చేయడానికి ప్రయత్నిస్తోంది.
హేతుబద్దంగా వనరుల వినియోగం
గత ప్రభుత్వం రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ప్రకటించిన పథకాలు అనేక దఫాలలో అమలులో లోపాలను ఎదుర్కొన్నాయి. ప్రజా ప్రభుత్వం 2023-24లో రూ.9,240 కోట్లను వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించి, వాటి పటిష్ట అమలుకి చర్యలు చేపట్టింది.
రైతులకు రుణమాఫీ పథకం
ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 22.47 లక్షల మంది రైతులకు రూ.17,896 కోట్ల రుణమాఫీని ఒకేసారి అమలు చేసి రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలని సరి చేసి రైతాంగానికి మేలు చేకూర్చింది.
నష్ట పరిహార చెల్లింపులు
రాష్ట్రంలో వర్షాల కారణంగా పంటలకు, ఇళ్లకు జరిగిన నష్టానికి, ఇతర నష్టాలకు తక్షణ పరిహారంగా రూ.250 కోట్లు విడుదల చేశారు. తద్వారా వంట నష్టం పరిహారపు చెల్లింపులో గత ప్రభుత్వం అవలంభించిన నిర్లక్ష్య విధానాలకు ప్రజా ప్రభుత్వం స్వస్తి పలికింది.
ఉద్యోగ నియామకాలు
కోరి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమే. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 43,880 పోలీసు, విద్య, వైద్య, ఇతర విభాగాల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తిచేసి నిస్సహాయులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించారు. మెగా డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 563 గ్రూప్-1 పోస్టులకు విజయవంతంగా ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 5,378 అదరపు పోస్టులు భర్తీ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం మార్చిలో అసెంబ్లీలో ఆడిట్ రిపోర్టును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. గత పది ఏళ్ల పాలకులు ఈ సంస్కృతిని తుంగలో తొక్కారు. ఆర్ధిక క్రమశిక్షణను పాటించకపోవడంతో ఎనిమిది అడిట్ రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజా ప్రభుత్వం రాగానే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగు రిపోర్టులు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండు రిపోర్టులు, 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రెండు అడిట్ రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.