*రైతు బంధు రాలేదని ముఖార కే గ్రామ రైతులు పొలాల వద్ద నిరసన*
రైతు భరోసా రాలేదు రైతు పండుగా చేసేదేలా ముఖ్యమంత్రి గారు, రైతు రుణమాఫీ కాలేదు విజయోత్సవాలు జరిపేదెల? పింఛన్ 4000 కు పెంచలేదు విజయోత్సవాలు జరిపేదెలా ముఖ్యమంత్రి గారు? ఆరు గ్యారంటీలు అమలు కాలేదు విజయోత్సవాలు జరిపేదెల ముఖ్యమంత్రి గారు అంటూ ముఖరా కె గ్రామంలో రైతులు, యువకులు, వ్యవసాయ కూలీలు, పింఛన్ దారులు నిరసన తెలిపారు….100 రోజులో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి ఏడాది అవుతున్న ఒక హామీ కూడా అమలు కాలేదని, ప్రభుత్వం మాత్రం విజయోత్సవాలు జర్పడం సిగ్గు చేటు అని, రైతు భరోసా రాలేదు రైతు పండుంగా జరిపేదెల? 2లక్షల రుణమాఫీ కాలేదు విజయోత్సవాలు జరిపేదెల? ఉద్యోగాలు రాలేదు, పింఛన్ 4000 పెంచలేదు, మహిళలకు 2500 రాలేదు, డిగ్రీ అమ్మాయిలకు స్కూటీ లు రాలేదు విజయోత్సవాలు జరిపేదెల ముఖ్యమంత్రి గారు అంటూ ప్లకార్డులు పట్టుకొని వ్యవసాయ క్షేత్రంలో రైతుబందు గోవిందా, రుణమాఫీ గోవిందా, పింఛన్ పెంచుడు గోవిందా, కేసీఆర్ కిట్ గోవిందా, 6గ్యారంటీలు గోవిందా అంటూ నిరసన తెలిపిన ముఖరా కె గ్రామస్తులు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, అశోక్, దత్త, పరమేశ్వర్, ప్రలాద్, బాలాజీ రైతులు యువకులు, రైతు కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు