రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో న్యూ కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరై గురుకులంలో కామన్ డైట్ మెనూ ను ప్రారంభించిన
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్.
– గురుకులంలో తరగతి గదులను, వాష్ రూం లలో పారిశుద్ధ్యం ను పరిశీలించిన ముఖ్య కార్యదర్శి.
– విద్యార్థులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ ముఖాముఖి.
ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ
వచ్చే శనివారం సాంఘిక సంక్షేమ గురుకులం స్కూల్, జూనియర్ కళాశాలలో
గైనిక్ డాక్టర్ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం.
– ఇంటర్ లో విద్యార్థినీ లు ఎక్కువ మార్కులు వస్తున్న ఐఐటి లలో ప్రవేశం లభించడం లేనందున
విద్యార్థినిలకు ఐఐటి లలో సీట్లు వచ్చేలా నీట్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు.
– CSR నిధుల తో రూ.60 లక్షలతో మినరల్ వాటర్, బెంచ్ లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పిస్తాం.
ఆహ్లాదం పంచేలా ఫ్లోరల్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని ముఖ్య కార్యదర్శి తెలిపారు.
– మహేశ్వరం సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో చేపట్టాల్సినకావల్సిన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించిన వెనువెంటనే , అమలు పరిచేందుకు జోనల్ కమిషనర్, RDO, CDPO, OSD, ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి గురుకుల పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.