సీనియారిటీలో 7వ స్థానంలో ఉన్నా సీఎస్ అవకాశం ఇచ్చే ఆలోచనలో సర్కార్ !
శ్రీలక్ష్మి, అనంతరాము, అజయ్ జైన్, సాయిప్రసాద్, సుమిత్ర దావ్రా, సిసోడియా తర్వత వున్న విజయానంద్.
దాదాపు 14 ఏళ్లుగా ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన భారతదేశంలో ఒకే ఒక్క అధికారి. అదానీ పవర్ ప్రాజెక్టు,పలు ఇతర అంశాలలో విజయానంద్ పాత్రపై విస్త్రుత ప్రచారంలో ఉంది. ఆయనకు కూడా బడా కంపెనీలు అండగా ఉన్నాయి అని అంటున్నారు.
సాయిప్రసాద్ విషయం లో పలు అంశాలతో పాటు సామాజిక కోణంలో సర్కార్ చివరి నిమిషంలో వెనుక అడుగు వేసినట్లు సమాచారం .
ఏది ఏమైనప్పటికీ వివాదాలకు తావు లేకుండా, కేంద్రం లో సెక్రటరీ గా వున్న సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్ సుమిత్ర దావ్రా లాంటి వారిని నియమిస్తే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.