Wednesday, February 5, 2025
HomeUncategorizedఒక్క డీఎస్పీ నిర్లక్ష్యం.. ఆరు ప్రాణాలు బలి..!

ఒక్క డీఎస్పీ నిర్లక్ష్యం.. ఆరు ప్రాణాలు బలి..!

*ఒక్క డీఎస్పీ నిర్లక్ష్యం.. ఆరు ప్రాణాలు బలి..!*

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టిక్కెట్లు ఇచ్చేందుకు తిరుపతిలో గతంలో ఎప్పుడూ చేయనంత ఏర్పాట్లు చేశారు.. మొత్తం ఎనిమిది చోట్ల టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఏడు చోట్ల బారీకేడ్లు పెట్టారు. అంతా ప్రశాంతంగా జరిగిపోయేలా చేశారు. ఎనిమదో చోట మాత్రం.. బారీకేడ్లు అవసరం లేదని అక్కడి డీఎస్పీ నిర్లక్ష్యం చేశారు.. టీటీడీ అధికారులు చెప్పినా పట్టించు కోలేదు. తాము చూసుకుంటా మన్నారు. అక్కడే తొక్కిసలాట జరిగింది..

బైరాగి పట్టెడ టోకెన్ జారీ కేంద్రం వద్ద డీఎస్పీ రమణ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. మిగతా అన్ని చోట్ల లాగానే బారీకేడ్లు, ఇతర ఏర్పాట్లు చేద్దామని టీటీడీ అధికారులు చెబితే ఆయన నిర్లక్ష్యం వహించారు. తొక్కిసలాట జరిగిన మహిళ అపస్మారక స్థితి లోకి వెళ్లిన సమయంలో అందర్నీ కంట్రోల్‌లో ఉంచాల్సిన ఆయన.. గేట్లు తీశారు. దీంతో, టిక్కెట్లు ఇవ్వడానికే తెరిచారు అనుకుని అందరూ దూసుకొచ్చేశారు. ఫలితంగా మరణాలు పెరిగాయి..

ఒక్క డీఎస్పీ అనాలోచితం కారణం గానే ఈ మొత్తం ఘటన జరిగిందని స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఓ అంబులెన్స్‌ను తీసుకొచ్చి అడ్డంగా పెట్టి డ్రైవర్ వెళ్లిపోయాడు. దాంతో, భక్తులు అటూ ఇటూ కదలడానికి అవకాశం లేకుండా పోయింది.

అయితే, ఇందులో కుట్ర ఉందని అనుకోవడం లేదని.. ప్రమాదవశాత్తూ గానే జరిగిందని ఎవర్నీ నిందించ లేమని టీటీడీ అధికారులు అంటున్నారు.  బాధ్యతగా ఉండాల్సిన అధికారులు ఆ.. ఏం జరుగుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఆ డీఎస్పీ వ్యవహారంపై ఎస్పీకి వెంటనే ఫిర్యాదు చేశారు. ఎస్పీకి సిబ్బందితో వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

*తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి వివరాలు..*

1) లావణ్య స్వాతి (37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం.

2) శాంతి (35) కంచర పాలెం, విశాఖపట్నం.

3) రజని (47), మద్దెల పాలెం, విశాఖపట్నం.

4) బాబు నాయుడు (51), రామచంద్ర పురం, నరసరావుపేట.

5) మల్లిగ (50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు.

6) నిర్మల (45), పొల్లాచ్చి, తమిళనాడు..

*మృతుల కుటుంబాలకు   నష్టపరిహారం రూ. 25 లక్షలు ప్రకటించిన ఏపి రాష్ట్ర ప్రభుత్వం..*

*సంఘటనపై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రుల బృందం..*

తిరుపతి: వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన  తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు ఏపి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు..

గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మార్చురి నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ..  ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఏపి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సిసి కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి
ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మృతి చెందిన వారి కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థికసాయం అందజేయడం జరుగుతుందన్నారు.

తిరుపతిలో జరిగిన సంఘటన తెలిసినన  వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతికి  పంపడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరగడం దురదృష్ట కరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృత దేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments