Wednesday, February 5, 2025
HomeUncategorizedఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు పరిష్కారం,కొత్త SHG ల ఏర్పాటు పై ఫోకస్ పెట్టండి : రాష్ట్ర పురపాలక...

ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు పరిష్కారం,కొత్త SHG ల ఏర్పాటు పై ఫోకస్ పెట్టండి : రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్

*ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిష్కారం,కొత్త SHG ల* *ఏర్పాటు పై ఫోకస్ పెట్టండి : రాష్ట్ర పురపాలక* *పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్*

– *అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళను SHG లో చేర్పించాలి.*

– *పురపాలికల్లో పన్ను వసూలు లక్ష్యాల సాధన,* *రెవెన్యూ జనరేషన్ అంశాలపై కమిషనర్ లు ప్రత్యేక చొరవ చూపాలి.*

MCHRD 09, జనవరి 2025:

ఎల్ఆర్ఎస్ (అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తు పరిష్కారం, కొత్తగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.

గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్రంలోని 142 పురపాలక సంఘాల కమిషనర్ లతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్  సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్ , రెవెన్యూ , రెవెన్యూయేతర పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకూ సాధించిన లక్ష్యం, ఇంకా చేయాల్సిన పన్ను వసూళ్లు, భువన సర్వే, మెప్మా  కార్యకలాపాల ప్రగతి, తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ మాట్లాడుతూ…

ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిష్కారం వేగవంతం చేసేందుకు క్లియర్ పట్టా భూములు ఉండి,   అనుమతులు లేని లే అవుట్ లను వేగంగా
క్రమబద్ధీకరణ చేసేందుకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను పాదదర్శకంగా,
మార్చి నెల చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు.  దరఖాస్తు దారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రోత్సహించాలి.


అర్హమైన ప్రతి మహిళ ను స్వయం సహాయక సంఘంలో చేర్పించాలని ప్రభుత్వం ఏజెండా గా పెట్టుకుందన్నారు.

మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజి కింద ఇవ్వాలని
లక్ష్యంగా నిర్దేశించుకుంటే , ఇప్పటి వరకూ 2500 కోట్ల రూపాయలను సంఘాలకు అందించడం జరిగిందన్నారు. ఫలితంగా ప్రభుత్వం బ్యాంక్ లింకేజ్ లక్ష్యం ను 5000 కోట్లకు పెంచిందన్నారు. మిగతా 2500 కోట్లను సంఘాలకు అందించేందుకు మున్సిపల్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

పురపాలిక పరిధిలో అర్హత ఉండి సంఘంలో సభ్యులు లేని ప్రతి మహిళను కొత్తగా సంఘాలను ఏర్పాటు చేసి సభ్యులుగా చేర్పించాలని చెప్పారు.
వచ్చే మార్చిలోగా 50 శాతం మందిని, జూన్ లోగా మిగతా 50 శాతం మందిని మొత్తం 100 శాతం మహిళలను 6 నెలల్లోగా సభ్యులుగా చేర్పించాలని చెప్పారు. సంఘ మహిళల్లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ స్కిల్ లను పెంపొందించాలన్నారు.

మహిళా స్వయం సహాయక సంఘాల(SHG) ద్వారా ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు ప్లాంట్ల టెండర్లను త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనున్న నేపథ్యంలో…
మెప్మా స్వయం సహాయక సంఘాల ద్వారా పట్టణాల పరిధిలోని ఖాళీ స్థలాలు, రిజర్వాయర్ లు, వాటర్ ట్యాంక్ లపై సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాట్లకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలన్నారు.


రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా పట్టణ జనాభా ఉందన్నారు. త్వరలోనే దేశంలోనే అత్యధిక అర్బన్ ఏరియా ఉన్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుందన్నారు. రాష్ట్ర GSDP కి 70 శాతం ఆదాయం అర్బన్ ఏరియా నుంచే వస్తుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్న పురపాలక శాఖ కు క్షేత్ర స్థాయిలో మంచి పేరు తెచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు.
క్షేత్ర స్థాయిలో శాఖను మరింత పటిష్టం చేసేందుకు
ప్రభుత్వం వచ్చే 6 నెలల్లో 48 మున్సిపల్ కమిషనర్ లు, 300 టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించనుందన్నారు.
భువన సర్వే ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఆస్తి పన్ను, ట్రెడ్ లైసెన్సు, నీటి పన్ను వసూలు ఆశించిన మేర లేదన్నారు. క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం తో పాటూ…
LRS , రెవెన్యూ మేళాలు, ప్రత్యేక డ్రైవ్ లు
నిర్వహిస్తూ మార్చి నెలాఖరులోగా వందశాతం లక్ష్యాలను సాధించాలన్నారు.

పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ టి కే శ్రీదేవి మాట్లాడుతూ….
పురపాలిక పన్నుల వసూళ్ల కు కమిషనర్ లు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం ముఖ్య కార్యదర్శి, కమిషనర్ పురపాలక శాఖ వాల్ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు.

సమావేశంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

——————————————————
పిఆర్ఓ,MA&UD కార్యాలయంచే జారీ చేయనైనది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments