Wednesday, February 5, 2025
HomeUncategorizedనల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి  ఉద్యోగుల పై సిరియస్, గుర్రంపోడు పీహెచ్ సి ఆకస్మిక...

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి  ఉద్యోగుల పై సిరియస్, గుర్రంపోడు పీహెచ్ సి ఆకస్మిక తనిఖీ  గైర్హాజరు  అయిన ఉద్యోగుల సస్పెన్షన్ వేటు.

అనధికారికంగా విధులకు గైహాజరైనందుకుగాను నల్గొండ జిల్లా, గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుండి తొలగించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి .
     ముందస్తు అనుమతి లేకుండా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది  మొత్తానికి మొత్తం విధులకు గైర్హాజరు  కావడంపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అందరిని ఉద్యోగం నుంచి తొలగించడం , రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది.

     బుధవారం ఆమె గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

      జిల్లా కలెక్టర్  ఆకస్మిక తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో సహా ఎవరు  విధులలో లేరు అందరూ విధులకు గైర్హాజరయ్యారు .ప్రభుత్వం బుధవారం ఎలాంటి సెలవును ప్రకటించనప్పటికీ బాధ్యత లేకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మొత్తం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం సోచనియమని కలెక్టర్ అన్నారు.
   కాగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం హెల్త్ అధికారి హరిలాల్ మాత్రం ఉపనియామకంపై ఇతర చోట పనిచేస్తున్నారు.
    కాంటాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఫార్మసిస్టు శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్ శ్రీనివాస్, అటెండర్, అరుణ జ్యోతి, అటెండర్ ఎల్లమ్మ లను ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే అటెండర్ లక్ష్మీనారాయణ, ఫార్మసిస్ట్ భాగ్యమ్మ  రెగ్యులర్ ఉద్యోగులను  సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

     ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై ఇలాంటి చర్యలే తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం , వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది మొత్తం గైర్హాజరు కావడం బాధాకరమని ,అందువల్లనే అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.
________________________________

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments