Wednesday, March 12, 2025
HomeUncategorizedప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్ బాబ

హైదరాబాద్ ఫిబ్రవరి13, (సమయం న్యూస్)

హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం నాడు గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని సిఎం రేవంత్ రెడ్డితో కలసి ప్రారంభించిన సందర్బంగా ఆయన ప్రసంగించారు. మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, విద్యుత్తు వాహనాల ఉత్పత్తి కేంద్రంగా, క్వాంటమ్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ రంగాలతో పాటు మూసీ పునరుజ్జీవన పథకం ద్వారా ఈ నగరం సుస్థిరాభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని శ్రీధర్ బాబు చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో హైదరాబాద్ అనుబంధం మూడు దశాబ్దాల నాటిదని, తాజాగా 11 లక్షల చదరపు అడుగుల విస్ణీర్ణంలో నూతన భవనం నిర్మించడం ద్వారా తన అంకితభావాన్ని చాటుకుందని ఆయన ప్రశంసించారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో భారీ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ ను అతిపెద్ద డేటా సెంటర్ల హబ్ గా మారుస్తోందని కొనియాడారు. ‘ఏఐ సిటీలో తమ కృత్రిమ మేధ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించడం మా ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనం. సాంకేతిక దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల, అడోబ్ (Adobe) సిఇఓ శంతను నారాయణ్ లను ప్రపంచ టెక్నాలజీకి అందించిన ఘనత ఈ నగరానిది. నూతన ఆవిష్కరణలకు మూలస్థంబంగా స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలోని ప్రతి మూలన జరుగే సాంకేతిక విప్లవానికి ఈ నగరం ఏదో రకంగా భాగస్వామిగా ఉంటోంది. ఇక్కడితో మేం సంతృప్తి చెందడం లేదు. ఇది ఒక ఆరంబం మాత్రమే కాదు. సుధీర్థ ప్రస్థానానికి రహదారులు వేస్తున్నాం. 52 ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాలు, 30కి మించిన విశ్వవిద్వాలయాలు, 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సులు, 60 లక్షల మంది ఉత్సాహం ఉరకలెత్తే శ్రామికశక్తితో  హైదరాబాద్, తెంలంగాణా వెలుగులీనుతోంది. 90 లక్షల ఇళ్లను డిజిటల్ కనెక్టివిటిలోకి తీసుకొస్తున్నాస్తున్నాం’ అని శ్రీధర్ బాబు వెల్లడించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments