
పార్టీ పండుగకు రండి..
——————–
పేదల బానిస బతుకుల విముక్తి కోసం..
నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం..
పేదల చేత..
పేదల యొక్క..
పేదల కోసం..
సుస్థిరమైన ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా
స్వార్థపూరిత రాజకీయాలకు చరమగీతం పాడేందుకు
దళాధిపతి శ్రీ.విజయ్ కుమార్.G. Srkr, IAS(R) ఆధ్వర్యంలో ఆవిర్భవించిన
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ..!
ఒక వసంతం పూర్తి చేసుకుంది.
ఆ రోజు నాన్న మాట కోసం “IAS అధికారి అయ్యారు.
ఈ రోజు అభివృద్ధికి దూరంగా ఉంటున్న అధిక జనం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వారసత్వపు రాజకీయాలకు చెక్ పెడుతూ సరికొత్త పంథాకు నాంది పలికిన రోజు
2024, ఫిబ్రవరి 14.
సరిగ్గా ఏడాది క్రితం అధిక జన మహా సంకల్ప సభ సాక్షిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేరును మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ప్రకటించారు. 2024, ఫిబ్రవరి 14న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణం నుంచి *“లిబరేషన్ కాంగ్రెస్”* అంటూ పార్టీ పేరును ప్రకటించిన దళాధిపతి విజయ్ కుమార్ గారు ముందుగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు.
ఆ తరువాత ఐక్యత విజయపథం పాదయాత్రలో సహకరించిన ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. దృఢమైన సంకల్పంతో పాదయాత్ర ప్రారంభించి, అన్ని ఒడుదుడుకులను తట్టుకొని పాదయాత్ర పూర్తి స్థాయిలో విజయం సాధించారు.
14న కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు:
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ నెల 14వ తేదీన తాడేపల్లి మండలం ప్రాతూరు రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జనరల్ బాడీ సమావేశం పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్‌కుమార్ గారి అధ్యక్షతన జరుగనుంది.
ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ఆరోజు ఉదయం కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పార్టీ జెండాను ఎగురవేసి ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ప్రారంభిస్తారు.
ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోవడం జరుగుతుంది.
పార్టీ ఆవిర్భవ వేడుకలు విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుల వారి తరఫున ఆహ్వానిస్తున్నాం.