


తేదీ 2-3-2025
సంగారెడ్డి జిల్లా
*శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ గ్లోబల్ హీరో*
*ఐ ఐ టిలలో బ్యాక్ బెంచ్ లె ఉంటాయి,బ్యాక్ బేoచేర్ లు ఉండరు*
*ఐ ఐ టి విద్యార్థులు, టీచింగ్ సిబ్బంది నాకు అతిధులు, మిమల్ని పార్లమెంట్ కు ఆహ్వానిస్తున్న*
*సృజనాత్మకత, ఆవిష్కరణలె భారత్ పెట్టుబడి*
*శాస్త్ర, సాంకేతిక రంగాలె భారత్ ను శాసిస్తున్నాయి*
*అర్థవంతమైన పరిశోధనలకు మూలం ఐ ఐ టి లు*
*కృత్రిమ మేదా (Al )నూతన శకానికి నాంది, ఒక నూతన విప్లవం*
*విద్యార్థులు భారత దేశ వారసత్వాన్ని అభివృద్ధి చేయాలి*
*ప్రశ్నలు అడగడం ,ప్రశ్నలకు సమాధానాలు వెతకడం విద్యార్థులు నేర్చుకోవాలి*
*విలువలతో కూడిన విద్య అవసరం*
*విద్యార్థులు ఆలోచన శక్తి ని పెంచుకోవాలి, మానవత్వాన్ని అలవరుచుకోవాలి*
*ఈ ఐ ఐ టి లో 5000 మంది విద్యార్థులకు,600 మంది టీచింగ్ సిబ్బందికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది*
*టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకు చేరావేయాలి– గ్రామీణ ప్రాంతాలనుంచి అందుకోవాలి*
*విద్యార్థి జీవితం లో మార్పు ముఖ్యం , స్థిర లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి*
*చంద్రయాన్ -2 ,3 సమయం లో భారత్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొని విజయవంతం చేశాం*
*విద్యార్థుల పెట్టుబడి సృజనాత్మకత,ఆవిష్కరణలు*
*వ్యాపార, పారిశ్రామిక వేత్తలు ఎదగాలి*
*భారత్ వివిధ భాషల నిలయం,పార్లమెంటు లో అన్ని భాషలు ట్రాన్స్లేట్ అవుతున్నాయి*
*సోషల్ మీడియా చాలా శక్తి వంతంగా తయారు అయింది*
*బ్యాంకింగ్ ,డిజిటల్ ఇండియా సేవలో దేశం ముందుకు పోతుంది*
*విమర్శలకు లోను కావొద్దు… విమర్శను ఆదర్శంగా తీసుకోవాలి*
— ఉప రాష్ట్రపతి జగదీష్ దన్ఖర్
హైదరాబాద్ ఐఐటి నీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్, శ్రీమతి సుదేశ్ దన్కర్(Dhankar) సందర్శించారు. సాంకేతిక విద్య ప్రగతి గురించి విద్యార్థులు అధ్యాపకులతో ముచ్చటించారు.
ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ..
నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, పరిశోధనలపై, ఆర్థిక వ్యవస్థ పలు అంశాలను విద్యార్థులతో ఉపరాష్ట్రపతి పంచుకున్నారు. విభిన్న భాషలు, సంస్కృతల నేపద్యం భారతదేశం… 5 వేల సంవత్సరాల పూర్వం నుంచి భారతదేశం మేదో
పరంగా ఉన్నతంగా ఉందన్నారు. ఐఐటీల శాస్త్రయ పరిశోధనలతో 20 కోట్ల మంది రైతులకు నేరుగా బ్యాంకుల్లో … ప్రోత్సాహం పొందుతున్నారని అన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలతో డిజిటల్ మార్కెటింగ్ అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులు సృజనాత్మకతపై దృష్టి సారించాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం ఒక గ్లోబల్ లీడర్ గా ఎదగాలన్నారు. విద్యార్థులు ఐఐటీ ల విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిధులని… పార్లమెంటును సందర్శించాలని కోరారు. చంద్రయాన్ తొలిదశలో విఫలమైనప్పటికీ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విజయవంతం చేశామన్నారు. ఐఐటీ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా రాణించాలన్నారు.
ఐఐటి ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు .గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఐటీ చైర్మన్ బివి మోహన్ రెడ్డి, ఐఐటి డైరెక్టర్ బీ ఎస్ మూర్తి, పార్లమెంటు సభ్యుడు.. ఎం రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు
మొక్క నాటారు, జ్యోతి ప్రజ్వలన చేశారు అని పెట్టండి, ఐ ఐ టి వారు శాలువా , బుద్దుని ప్రతిమ తో ఉప రాష్ట్రపతి దంపతులను, గవర్నర్ ను సత్కరించారు.