

ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు. జారి పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా సదరం UDID పై సంబంధిత అధికారులు, దివ్యంగులు, వైద్యాధికారులు, apm లతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం జాతీయ డేటాబేస్‌ను రూపొందించే ఉద్దేశ్యంతో UDID ఉప పథకం అమలు చేయబడుతోందనీ, UDID ప్రాజెక్ట్ కింద, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నోటిఫై చేసిన సమర్థ వైద్య అధికారుల ద్వారా వికలాంగులకు వైకల్య ధృవీకరణ పత్రాలు , ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు జారీ చేయబడతాయనీ ప్రభుత్వ ప్రయోజనాలను వికలాంగులకు అందించే వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని
UDID (Unique Disability ID card) కార్డు నమోదు ప్రక్రియ పై విసృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సదరం సర్టిఫికెట్ కొరకు వచ్చే ప్రజలు UDID కార్డు నమోదు చేసుకోవాలన్నారు. UDID కార్డు కొరకు మొబైల్ నుండి గాని, మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతం లో మాదిరి కాకుండా నేరుగా పోస్టు ద్వారా దరఖాస్తుదారులకు ఈ కార్డు చేరడం జరుగుతుందన్నారు. UDID కార్డు నమోదు పై వీవోఏ, SHG సభ్యులు, పంచాయితీ కార్యదర్శులు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఈ UDID కార్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా లాభం పొందుతారని తెలిపారు.
అనంతరం మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు గూగుల్ మీట్ ద్వారా అవగాహనా కల్పించారు.
ఈ సమావేశంలో DRDO పిడి రవీందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్, acdpo మిల్కా, రిమ్స్ డైరెక్టర్ దివ్యంగుల కమిటీ సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.