Friday, November 22, 2024


సంగారెడ్డి జిల్లా


భారీ వర్షాలకు నిండిన సింగూర్ జలాశయం…
-రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.
– ఈ  యేడు సాగుకు డోకా లేదన్న మంత్రి


వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సింగూర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం *ప్రాజెక్టు* రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టు 4,6 నంబర్ల రెండు గేట్లను 1.50 మీటర్ల పైకెత్తి 16284   క్యూసెక్కుల నీటిని
దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో జెన్ కో ద్వారా 2822 క్యూసెక్కులు, రెండు గేట్ల ద్వారా  16284 క్యూసెక్కుల నీటిని మొత్తం 19106 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టు నిండు కోవడం వలన ఆయకట్టు రైతంగానికి ఏడు రెండు పంటల సాగుకు ఢోకా ఉండదని  అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టని చేరుకొని జలకళ
సంతరించుకోవడం సంతోషకరమన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదనీరు వస్తుండడంతో దిగువకు నీరు వదిలామన్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండల మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులో  మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు. 


  అనంతరం బస్వాపూర్  మోడల్ స్కూల్లో  సందర్శించారు.  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ  జన్మదినోత్సవాన్ని  పురస్కరించుకొని   మోడల్ స్కూల్  ఉపాధ్యాయులు,విద్యార్థులతో కలిసి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని ఆయన అన్నారు.నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని  మంత్రి  పరిశీలించారు . పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల  ప్రిన్సిపల్ జ్యోతి , మంత్రి గారి  దృష్టికి  తెచ్చారు. నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న  పనులు నాణ్యత పాటించి  వేగవంతంగా, పూర్తి చేయాలని అధికారులను మంత్రివర్యులు ఆదేశించారు  .

  ఈ కార్యక్రమంలో   నీటి పారుదల శాఖ అధికారులు  కె. ధర్మ, సి,ఈ, భీమ్ ఇఇ, నాగరాజు డీఈఈ  , ఆర్ డి ఓ పాండు,స్థానిక ప్రజా ప్రతినిధులు,  పాల్గొన్నారు.

Previous article
గ్లోబల్ ఏఐ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం

గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2024, తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమివ్వగా, హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ప్రపంచ లీడర్ గా ఎదుగుతున్న తరుణంలో సదస్సు ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది.

ఐటీ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. “తెలంగాణ ఈ విప్లవంలో కేవలం పాల్గొనడం మాత్రమే కాదు, దానిని నడిపిస్తోంది,” అని అన్నారు. రాష్ట్రం సంవత్సరానికి 11.3% ఆర్థిక వృద్ధిని సాధించడంతో, మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) 176 బిలియన్ డాలర్లుగా చేరింది. త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నట్టు చెప్పారు.

తెలంగాణ AI వ్యూహానికి కేంద్రబిందువు హైదరాబాదు సమీపంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన AI సిటీ. ఇది AI పరిశోధన, అభివృద్ధికి అంకితం చేయబడిన హబ్‌గా రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణను గ్లోబల్ AI చుక్కానిగా నిలబెట్టడానికి, అత్యాధునిక కంప్యూట్ ఫెసిలిటీస్, విస్తృత డేటా సెంటర్లు, సుస్థిర కనెక్టివిటీని అందిస్తోంది. “ఈ AI సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుంది, మా టెక్నాలజీ శక్తిసామర్థ్యాన్ని దృఢంగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. AI సిటీలో ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రారంభించడానికి కూడా మేం ప్రణాళికలు సిద్ధం చేశాం,” అని మంత్రి ప్రకటించారు.

ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యేంత వరకు శంషాబాద్ తెలంగాణ ప్రపంచ వాణిజ్య కేంద్రం 2 లక్షల చదరపు అడుగుల అన్ని సౌకర్యాలతో కూడిన కార్యాలయ స్థలాన్ని AI ఆధారిత కంపెనీల కోసం అందిస్తుంది, తద్వారా AI సిటీ రూపకల్పన జరుగుతున్నప్పుడు వారు కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

‘AI ఆధారిత తెలంగాణ’ కింద పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలు, విద్యాసంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలతో 26 అవగాహన పత్రాలు (MoUs) కుదుర్చుకుంది. ఈ అవగాహన పత్రాలు తెలంగాణను దేశంలో AI పరంగా బలమైన శక్తిగా మార్చడానికి ఉపకరిస్తాయి. ఈ అవగాహన పత్రాలను ప్రధానంగా 7 విభాగాల్లో కుదుర్చుకున్నాం: కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్‌లెన్స్ కేంద్రం, స్కిల్లింగ్, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, స్టార్టప్ ఇన్నొవేషన్, జనరేటివ్ AI, పరిశోధన సహకారం, డేటా అనోటేషన్.

AI అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ AI పాలన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించిందని చెప్పారు. AI తప్పుదోవ పట్టించే సందర్భాలు, డీప్ ఫేక్స్, మరియు AI ఆధారిత తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి నియంత్రణలను కలిగి ఉండే విధంగా ఈ పద్ధతిని రూపొందిస్తామని వెల్లడించారు.

ఈ అంశాలన్నింటిని సమన్వయం చేసి, AI ద్వారా తెలంగాణను ప్రపంచ మేధోశక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు పటిష్టంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments