HomeUncategorizedనిజామాబాద్ జిల్లాలో భారీ వర్ష పాతం నమోదు.
గడిచిన 5 రోజులుగా జిల్లాలో భారీ వర్షపాతం నమోదు...
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్ష పాతం నమోదు.
గడిచిన 5 రోజులుగా జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయింది. నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉన్న 1086 పెద్ద, చిన్న చెరువులు, 51 చెక్ డ్యామ్ లు, రామడుగు ప్రాజెక్ట్ మరియు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చినది. పెద్ద వాగు, కప్పల వాగు, పసుపు వాగు మరియు పూలాంగ్ వాగు పరివాహక ప్రాంతాలలో అధిక వర్షపాత కారణంగా ఈ వాగులలోకి వరద వెల్లువెత్తింది. భారీ వర్ష సూచన అందిన వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరియు వారి పర్యవేక్షణలో వరద ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి క్షేత్ర స్థాయి అధికారుల సహాయంతో నీటి పారుదల శాఖ సమర్ధవంతంగా పక్కా ప్రణాళికతో, ఆస్తి మరియు ప్రాణ నష్టం లేకుండా నిర్వహించింది. జిల్లాలో అన్ని ప్రాజెక్ట్ లు మరియు చిన్న నీటి వనరులలోకి నీరు చేరి నిండు కుండని తలపిస్తున్నాయి. నిజామాబాద్ వరప్రధాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండడం ద్వారా ఈ ఖరీఫ్ మరియు రబీ పంటలకు ఏ డోకా లేదు. ప్రస్తుత ఖరీఫ్, రబీ మరియు త్రాగు నీటి అవసరాలకు ప్రణాళికతో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు కృషి చేస్తున్నారు..