1992లో అజ్మీర్‌లో స్కూల్, కాలేజీ లకు వెళ్లే హిందూ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశారు. ఆ అత్యాచారం ఫోటోలు తీసి వీరిని బెదిరించి మరికొందరిని ఉచ్చులోకి లాగారు.
పూర్తి కధ చదవండి:
” ఇది సినిమా కథ కాదు ” (పేర్లు మార్చబడ్డాయి)
అది 1992 వ సంవత్సరం. సోఫియా సీనియర్ సెకండరీ స్కూల్ కి చెందిన ఒక విద్యార్థిని ని మాయ మాటలు చెప్పి ఫరూక్ క్రిస్టీ అనే వాడు లొంగదీసుకుని రేప్ చేశాడు. ఈ క్రిస్టీ రాజస్థాన్ లో గల ప్రముఖ అజ్మీర్ దర్గా వారి కుటుంబానికి చెందిన వాడు. అంతే కాక వీడు అజ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. వీడు ఆ అమ్మాయిని రేప్ చేసి ఊరుకోలేదు. అభ్యంతరకరమైన ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి, ఆ అమ్మాయి స్నేహితులను తన దగ్గరకు తీసుకురమ్మనమని బలవంతం చేసి, ఆ అమ్మాయి తన ఫోటోలు ఎక్కడ బయట పెడతారో ఆని భయంతో తన స్నేహితులను తీసుకురాగా ఆ పిల్లలతో కూడా ఇలా ఫోటోలు ద్వారా బ్లాక్ మెయిల్ చేసి వారి ద్వారా మరి కొంత మందిని ఈ ఊబి లోకి లాగాడు. ఈ మొత్తం స్కాంలో పరపతి గలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకుల ప్రమేయం కూడా వుండి ఒక అతి జగుస్పాకరమైన, భయంకరమైన సెక్స్ స్కాండల్ కొన్ని సంవత్సరాలు పాటు నడిపారు. ఫిర్యాదులు చేయడానికి సాంఘిక, కుటుంబ సమస్యలు వస్తాయి అని అమ్మాయిలు, కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయకపోవడంతో, మరీ ధైర్యం తెచ్చుకున్న ఈ గాంగ్ తమ పరిధి విస్తృత పరిచి ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలు పెట్టారు. కొన్ని లెక్కలు ప్రకారం 11 సం.ల నుండి 20 సం. ల వయసు గల 250 మంది పిల్లలు వరకూ ఈ ఉచ్చులో చిక్కుకున్నారు అని అంచనా. కానీ అప్పటి డిఐజీ ఒమేంద్ర భరద్వాజ ప్రకారం కొన్ని సం.లు నడిచిన ఈ స్కాం లో లెక్కకు అందని కొన్ని వందల మంది అమ్మాయిలు ట్రాప్ చేయబడ్డారు అని చెప్పారు.ఈ అవమానం భరించలేక చాలా మంది అమ్మాయిలు ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు అని ఆయన చెప్పారు.
ఎవరో ధైర్యం చేసి పోలీసు కంప్లైంట్ ఇచ్చినా అజ్మీర్ దర్గా వారు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసు ముందుకు వెళ్లకుండా చూసుకున్నారు. అదీ కాక ఇరుక్కున్న అమ్మాయిలు తమ భవిష్యత్ దృష్టిలో వుంచుకుని ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం కూడా ఈ ముష్కరులకు వరం అయింది.
అయితే మదన్ సింగ్ అనే జర్నలిస్ట్ ధైర్యం చేసి ఈ సంఘటన మీద వరుస కథనాలు తన వార పత్రికలో రాయడం తో ప్రజలు నిజాలు తెలుసుకుని పెద్ద యెత్తున నిరసనలు చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులు ఈ ఫరూక్ క్రిస్టీ అనే వాడిని, వాడికి సహకరించిన మరో ఇద్దరు క్రిస్టీలను (వీరు కూడా యూత్ కాంగ్రెస్ సిటీ నేతలు) చివరకు అరెస్ట్ చేశారు.
మొత్తం మీద 18మంది మీద నేరారోపణలు చేయగా నలుగురిని విడిచి పెట్టారు. ఫరూక్ క్రిస్టీ తో సహా 8 మందికి జీవిత ఖైదు విధించగా, శిక్షా కాల సమయం అయిపోయింది అని 2013లో హై కోర్ట్ ఫరూక్ క్రిస్టీ ని విడుదల చేసింది. చాలా మంది అమ్మాయిలు కేసు సమయంలో సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు రాకపోవడాన్ని మేం అర్ధం చేసుకోగలం అని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ కేసు 1980లలో ఉత్తర ఇంగ్లాండ్ రోతెర్ హమ్ లో జరిగిన చైల్డ్ సెక్స్ స్కాండల్ ని గుర్తుకు తెచ్చింది అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆ స్కాంలో 5గురు పాక్ కి చెందిన బ్రిటన్ పౌరులు అయిన టాక్సీ డ్రైవర్లు పిల్లల సంరక్షణ కేంద్రాల నుండి 10-14 సం.ల వయసు గల పిల్లలను ట్రాప్ చేసి, వారికి మందు, డ్రగ్స్ అలవాటు చేసి వారితో వ్యాపారం 10సం.లు పాటు కొనసాగించారు. ముందు ఫిర్యాదులు వచ్చినా అధికారులు సీరియస్ గా తీసుకోలేదు. చివరికి 2010లో చర్యలు మొదలు పెడితే 5గురు ఒకే కుటుంబానికి చెందిన పాక్ జాతీయులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అని కేసు పెట్టారు. 2019 వరకు కూడా ఈ కేసు విచారణ నడిచింది. మొత్తం 1400 మంది పిల్లలు ఈ స్కాం లో ఇరుక్కున్నారు అని తేలింది.
ఇది ఇలా వుండగా ఈ విలేకరి మదన్ సింగ్ మీద ఈ సంఘటనపై వార్తలు రాసే సమయంలోనే హత్యా ప్రయత్నం జరిగింది. అయితే గాయపడ్డ మదన్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ వుండగా మళ్ళీ దాడి చేసి అతన్ని హత్య చేశారు. మదన్ చనిపోయే నాటికి మదన్ కి 8,12 సం.ల ఇద్దరు మగపిల్లలు వున్నారు. మదన్ హత్యకు బాధ్యులు అని ముగ్గురు కాంగ్రెస్ నేతలు సవయ్ సింగ్, రాజకుమార్ జైపాల్ మరియు నరేంద్ర సింగ్ పై పోలిసులు హత్య నేరం క్రింద కేసులు పెట్టారు. అయితే సరి అయిన ఆధారాలు లేవు అని కేసు కొట్టేసి నిందితుల విడుదల కు హై కోర్టు 2012లో ఆదేశాలు ఇచ్చింది.
అయితే, జనవరి 2023, 7వ తేదీ రాజస్థాన్ లో పుష్కర్ ప్రాంతంలో ఒక రిసార్ట్ లో టీ తాగుతున్న సవాయ్ సింగ్ పై ఇద్దరు కాల్పులు జరిపి చంపేశారు. ఆ కాల్పులు జరిపింది వేరే ఎవరో కాదు 30 సం.ల క్రిందట హత్యకు గురి అయిన విలేకరి మదన్ సింగ్ కొడుకులు సూర్య ప్రతాప్ సింగ్, ధర్మ ప్రతాప్ సింగ్ లు. తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇన్ని సం.లుగా ఎదురు చూడగా ఇప్పటికీ అవకాశం కుదిరింది అని ప్రతాప్ సింగ్ చెప్పాడు.
అజ్మీర్ సెక్స్ స్కాండల్ గా ఈ వార్త అప్పట్లో దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. చాలా సం.లు అజ్మీర్ ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లి తండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్న జనవరిలో కూడా ఈ కేసు నిమిత్తం ఒక ఆమెను కోర్టుకు పిలవగా ఎన్నాళ్ళు ఇంకా ఇలా మమ్మల్ని వేధిస్తారు, నేను ఇప్పుడు అమ్మమ్మని అయిపోయాను, నా కుటుంబ సభ్యులకు నేను ఏం చెప్పుకోవాలి? అని జడ్జి గారిని ఆమె గట్టిగా ప్రశ్నించడం ఆమె వంటి వారు పడ్డ మానసిక క్షోభకు నిదర్శనం.
ఈ దారుణం లో అన్యాయం అయిపోయిన ఆడపిల్లలు, స్త్రీలు నేడు చాలా మంది అమ్మమ్మలు, నాయనమ్మలు అయిపోయారు.
*ఇంత సీరియస్ కేసుకే 32సం. లు పట్టింది అంటే, మన న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్పుకోవాలి?*