Friday, November 22, 2024
HomeUncategorized*హన్మకొండ* సమయం న్యూస్ :సెప్టెంబర్06;-*కాలుష్య రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ...

*హన్మకొండ*

సమయం న్యూస్ :సెప్టెంబర్06;-

*కాలుష్య రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపినిచ్చారు……*


వినాయక చవితి సందర్బంగా మెడిహిల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో జుబేదాస్ హోమ్ కేర్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలోలో హన్మకొండ కనకదుర్గ కాలనిలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఎంపీ గారు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే విధంగా జుబేదాస్ హోమ్ కేర్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేయడం అభినదనీయమని అన్నారు.

అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ మట్టిలో నుంచే సకల ప్రాణులు ఉద్భావించాయని  చెపుతుంటారని అన్నారు. అసలు వినాయకుడు పుట్టింది పార్వతి దేవి నలుగు మట్టి నుంచే కదా అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలని, మట్టి వినాయకులనే  పూజించాలని సూచించారు. మట్టి వినాయకుని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానమని మనకు జీవాన్ని, జీవితాన్ని మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయక చవితి ద్వారా లభిస్తుందని అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని మట్టి వినాయకుడిని పూజించాలని కోరారు. వినాయక చవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి ఉంటుందని అన్నారు. వినాయక చవితి పండుగను ప్రతీ ఒక్కరూ భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు.

Previous article
*ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలి*

డిమాండ్ చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి*

హైదరాబాద్ సెప్టెంబర్06.(సమయం న్యూస్ )పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావు పెడతారా ?తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన పనులు
పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ సీఎంగా ఉన్నా 9 నెలలలో ఒక్కసారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు
సాగునీటి శాఖా మంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదన్నారు

ఈ ఏడాది జూరాలకు భారీ వరద వచ్చింది
అత్యధికంగా 3.88 లక్షల ఇన్ ఫ్లో
50 రోజులలో 732 టీఎంసీల వరద
ఇక్కడ వడిసిపట్టింది 22 టీఎంసీలు మాత్రమే .. శ్రీశైలం, సాగర్ తర్వాత మిగతావన్నీ సముద్రం పాలు అవుతున్నాయన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుర్తి ఎత్తిపోతల కింద నిర్మించాల్సిన రిజర్వాయర్లను ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారన్నారు
3.50 లక్షల ఆయకట్టుకు కేవలం 3.90 టీఎంసీల ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను మాత్రమే నిర్మించారు .. అప్పటికే ఉన్న సింగోటం చెరువును దీనికోసం వినియోగిస్తున్నారనీ పేర్కొన్నారు
అప్పట్లోనే రిజర్వాయర్లు నిర్మించి ఉంటే భారీ వరదలు వచ్చిన ఇలాంటి సమయంలో నీళ్లు నింపుకునే అవకాశం ఉండేది

కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్ 8.51, ఏదుల 6.55, వట్టెం 16.74, కరివెన 15.34, ఉదండాపూర్ 16.03 టీఎంసీల సామర్ద్యం గల రిజర్వాయర్లను రికార్డు సమయంలో కోర్టు కేసులు, ఏపీ కుట్రలు, కాంగ్రెస్ కుట్రలను చేధించి నిర్మించారునీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆన్నారు.

ఎన్నికలకు ముందే నార్లాపూర్ లో ఒక పంపును కూడా ప్రారంభించారు

గత 9 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని మిగిలిపోయిన అరకొర పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది వట్టెం రిజర్వాయర్ వరకు అయినా ఏదుల రిజర్వాయర్ వరకు అయినా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదన్నారు
అధికారం దక్కిన వెంటనే పాత టెండర్లు రద్దు చేసి పాలమూరు రంగారెడ్డిని ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారు
ప్రభుత్వ పర్యవేక్షణ లేక వట్టెం పంప్ హౌస్ వరదలకు నీట మునిగిందినీ విమర్శించారు.
వరుణుడి దయ వల్ల ఈ ఏడాది భారీ వర్షాలు వచ్చి చెరువులు, కుంటలు నిండ యని   అన్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా కృష్ణాలో నీళ్లున్నా రిజర్వాయర్లను నింపుకునే పరిస్థితి లేదనీ విమర్శించారుప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next article
*విద్యుత్ శాఖ సిబ్బంది  పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయండి* – సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖి.

సెప్టెంబర్ 06- సమయం న్యూస్
సీఎండీ కార్యాలయంలో అవినీతి  ఫిర్యాదులు స్వీకరించుటకు ప్రత్యేక ఏర్పాట్లు  చేసినట్లు  ముషారఫ్ అన్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 – 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖి, ఐ.ఏ.ఎస్ తమ విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.

సంస్థ తమ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి గాను, పలు   అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది. కొంత మంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థ కు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ నేపధ్యం లో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ తెలిపారు. 

ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, క్యాటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.

సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణ కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి వున్నది. వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని  సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖి పేర్కొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments