Thursday, December 26, 2024
HomeUncategorized*ఆయిల్ పామ్ రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వాలి**కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నీ కోరిన...

*ఆయిల్ పామ్ రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వాలి*
*కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నీ కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.*

హైదరాబాద్ సెప్టెంబర్ 6 (సమయం న్యూస్)ఆయిల్ ఫామ్ రైతులకు  సరైన ధర వచ్చే విధంగా చూడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజసింగ్ చౌహన్ ని  వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల. నాగేశ్వర్ రావు విజ్ఞప్తి చేసారు.
తెలంగాణ రాష్ట్రంలో రీజనల్ కొకొనట్ డెవలప్మెంట్ బోర్డును భద్రాద్రి కోత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయుటకు విజ్ఞప్తి.
• సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అస్వరావ్ పేటలో ఏర్పాటు చేయుట విజ్ఞప్తి.
• 2024-25 సంవత్సరానికి ఆయిల్ ఫామ్ గెలల ధర టన్నుకు రూll. 15,000/- కనీస మద్దతు ధర కల్పించి ఆయిల్ ఫామ్ రైతులకు భరోసా కల్పించుటకు విజ్ఞప్తి.
గత వారంలో కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరద నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి సచివాలయంలో  గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో  మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరా గారు పై మూడు విషయాల గురించి వివరించారు. ఈ సందర్భముగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు సరైన ధర దక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో టన్ను 20వేల రూపాయలు ఉండగా ఇటీవల కాలంలో కష్టం డ్యూటీని ఎత్తివేసారని తెలిపారు.  కష్టం డ్యూటీని తగ్గించిన క్రమంలో టన్ను ధర 12 వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల రైతులకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. కనీసం మద్దతు ధర 2024-25 సంవత్సరంలో రూll. 5,000 రూపాయలు ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని  కోరారు.  అదేవిధంగా తెలంగాణకు కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరారు.
దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మాత్యులు త్వరలోనే పై మూడు విజ్ఞప్తులకు సంభందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Previous article
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ


హైదరాబాద్ సెప్టెంబర్06 ( సమయం న్యూస్) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు.  ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. 1966లో నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం రహమత్ నగర్ లో మహేష్ కుమార్ జన్మించారు. కాంగ్రెస్ విద్యార్థి రాజకీయాల్లో చేరిన మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తరవాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్ పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  వేర్ హౌజ్ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన ఆయన తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధిగా పని చేయడంతో పాటు 2021 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రత్యేక ఆహ్వానితుల కమిటీతో పాటు , ఇతర కీలక పార్టీ భాద్యతల్లో పని చేసిన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.
      రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మార్పు అనివార్యమయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉండకూడదనే పార్టీ లైన్ ప్రకారం రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడి కుర్చీ వదులుకోక తప్పలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఆయనతో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మధు యాస్కీ గౌడ్, బల రామ్ నాయక్, సంపత్ కుమార్, బలమూరి వెంకట్ ఉన్నారు. అయితే వ్యహాత్మకంగా కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసింది. రాష్ట్ర సీఎం రెడ్డి సామాజిక వర్గం కాగా, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇక రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం ఉండేలా రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించింది. గతంలో 2004లో వై యస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన డి. శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లు ముఖ్యమంత్రి లుగా పని చేసిన రోజుల్లో వరుసగా బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య పార్టీ అధ్యక్షులుగా పని చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా.. సామజిక వర్గాల బ్యాలన్సింగ్ తో పదవులను భర్తీ చేస్తున్న సాంప్రదాయాన్ని ఈ సారి కూడా కొనసాగించినట్టు కనిపిస్తోంది.
Next article
*కలెక్టరేట్ లో మట్టి గణపతుల పంపిణీ*

నిజామాబాద్, సెప్టెంబర్ 06 (సమయం న్యూస్) : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లో శుక్రవారం సాయంత్రం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ఉద్యోగులకు మట్టి గణపతులు పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తుండడం గొప్ప విషయమని ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. పర్యావరణ సమతుల్యత కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోనూ ప్రభుత్వపరంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జల వనరులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
——————
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments