పిర్యాదు చేసిన పట్టించుకోని వాటర్ వర్క్స్, బొదుప్పుల్ కార్పొరేషన్ అధికారులు.
బొడు ప్పుల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెంగి చెర్ల ఎం ఎల్ ఎన్ కాలనిలో డ్రెయినేజీ ఓవర్ ఫ్లో తో మురికి కుంప గా మారింది. ఏం ఎల్ ఎన్ కాలని లెఫ్ట్ సైడ్ 6,7,8 వీధి చివర శ్రీలక్ష్మి నరసింహ కాలని, ప్రతాప్ ఎంక్లేవ్ ఎదురుగా ప్రవేటు స్థలంలో డ్రెయినేజీ ఓవర్ ఫ్లో తో మురుగు నేరు నిలిచి ప్రజలకు మురుగు వాసన రావడంలో ఏం ఎల్ ఎన్ కాలని వాసులకు ప్రతాప్ ఎంక్లెవ్ వాసులకు అనారోగ్య పాలవుతున్నారు.
పైన నుండి కాలని నుండి వచ్చే మురుగు నీరు కాలువ పైపు లైన్ సైజ్ పెద్దగా క్రింది ప్రాంతంలో తక్కువ సైజ్ ఉండటం తో ఓవర్ ఫ్లో అయి ఖాళీ స్థలంలో మురుగు నీరు నిలిచిపోతున్నది గత మూడేళ్ళ నుండి ఇదే పరిస్తితి ఉన్నట్లు కాలని వాసుల తెలిపారు
హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఇంజనీర్లు చేసిన పొరపాటు వలన ఈ కాలని వాసులు మురుగు నీటి వాసన రాత్రి సమయంలో రావడం తో వాంతుల వస్తున్నట్లు దాంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కాలని వాసులు వివరించారు.
గత సంవత్సరం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కాల్ సెంటర్ కు పిర్యాదు చేసిన లాభం లేకుండా పోతున్నట్లు పేర్కొన్నారు వారం రోజుల తర్వాత మీ సమస్య పరిష్కారం చేసినట్లు మేసేజ్ వచ్చిందని కాలని వాసులు ఆరోపించారు
ఈ సెప్టెంబర్ మాసంలో సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కు పిర్యాదు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గాని కమిషనర్ గాని వచ్చి పరిశీలన కూడా చేయలేక పోవడం వారి యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు .
ప్రభుత్వాన్ని కి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందనీ ఏం ఎల్ ఎన్ , శ్రీ లక్ష్మీ నరసింహ కాలని వసూలు వాపోతున్నారు
ఇక నైనా మున్సిపల్ కమిషనర్ మురికి కూపంగ లేకుండా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇంటి పన్ను చెల్లించని వారి పై పెనాల్టీ వేస్తున్న మున్సిపల్ అధికారులు వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఉన్న అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాలని వాసులు కోరుతున్నారు