Friday, December 27, 2024
HomeUncategorizedబూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి రాజకీయ పార్టీలను కోరిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్...

బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి రాజకీయ పార్టీలను కోరిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.



*కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

నిజామాబాద్, సెప్టెంబర్ 11( :సమయం న్యూస్) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ఎస్ఎస్ఆర్ – 2025 లో భాగంగా బీ.ఎల్.ఓ లు ఇంటింటికి వెళ్లి బీఎల్ఓ యాప్ ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారణ చేసుకోవడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఇంటింటి సర్వేకు తోడ్పాటును అందిస్తూ ఓటరు జాబితా పక్కాగా రూపొందేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అవసరం ఉన్న చోట పోలింగ్ కేంద్రాలను విభజించడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాంటి పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తే, వాటి వివరాలను తమ దృష్టికి తేవాలని సూచించారు. అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాఫ్ట్ రోల్ ప్రకటించడం జరుగుతుందని, దానిని పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. ఈ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ బూత్ ల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 29 నుండి నవంబర్ 18 వ తేదీ లోపు రెండు పర్యాయాలు పోలింగ్ బూత్ స్థాయిలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్రాఫ్ట్ రోల్ లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి సవరించడం జరుగుతుందన్నారు. కాగా, ఓటరు జాబితాలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖుల పేర్లు ఉన్నాయా, లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరుగా పేరు నమోదు చేసుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు చూడాలని కోరారు. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
———————————

Previous article
Next article
*అమరావతి* సెప్టెంబర్11, (సమయం న్యూస్)

*చిన్నారుల పెద్ద మనసు – వరద బాధితుల కోసం పాకెట్ మనీ*

*ఆంధ్రప్రదేశ్లో వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని వర్గాల వారు సాయం చేస్తున్నారు.*

*చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.*

*తాజాగా పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్న వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.*

ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. విపత్తు సమయంలో మానవత్వం చాటుకుంటున్నారు. ప్రభుత్వం పిలుపుతో విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. ఎంతో మంది వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, గృహిణులు, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధితుల కోసం విరాళాలను అందిస్తున్నారు.

దీంతో వరద బారిన పడి సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపడుతున్న ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు వివిధ వర్గాలు, ప్రాంతాల వారు తమ స్థాయిని బట్టి విరాళాలను ఇస్తున్నారు.

*చిన్నారుల వీడియో వైరల్:* తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రులోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల చిన్నారులు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా తెగ వైరల్ అయింది. అనేక మంది పాఠశాల చిన్నారులను మొచ్చుకున్నారు.

చిన్నారుల వీడియోపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. వారిని మెచ్చుకుంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా అసాధారణ కరుణను చిన్నారులు ప్రదర్శించారని కొనియడారు. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహిస్తూ, ప్రాముఖ్యతను బోధిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని నేను అభినందించారు. ఇటువంటి చర్యలు మానవత్వంపై విశ్వాసాన్ని పెంచుతాయని స్పష్టం చేశారు.

మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు రమ్యకృష్ణ ఏజెన్సీస్ స్పందించింది. వరదల్లో తడిచి పాడైపోయిన గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా రిపేర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫోన్ నెంబర్, షాప్ అడ్రెస్తో బ్యానర్లను ఏర్పాటు చేశారు. రమ్యకృష్ణ ఏజెన్సీస్ వారిని మంత్రి లోకేశ్ అభినందించారు.

వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎల్‌జీ కంపెనీ సైతం ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబు పిలుపుతో ముందుకొచ్చిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ, ఉచితంగా సర్వీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉచిత సర్వీస్, స్పేర్ పార్టులపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫోన్, వాట్సప్ నెంబర్లను ఇచ్చారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉంటుందన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments