Friday, December 27, 2024
HomeUncategorizedమేడుగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టు ల పై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నుడి తుది...

మేడుగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టు ల పై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నుడి తుది నివేదిక త్వరగా తెప్పుంచండి.

మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి,

హైదరాబాద్ సెప్టెంబర్11-,( సమయం న్యూస్)

*NDSA
తుది నివేదికను త్వరితగతిన  ఇవ్వాల్సిందిగా అడగండి*

#సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు ఛత్తీస్ ఘడ్ నుండి అనుమతుల ప్రక్రియ వేగవంతం చెయ్యండి

#సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలను వేగవంతంగా నివృత్తి చెయ్యాలి

#త్వరితగతిన భూసేకరణ పూర్తి చెయ్యాలి

#సమ్మక్క సాగర్ ముంపువిషయంలో నష్టపరిహారం విషయమై చత్తీస్ ఘడ్ ప్రభుత్వం తో చర్చలు జరపండి

#లష్కర్ ల నియామకాలను వేగవంతం చెయ్యాలి

#విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

#ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలకు సత్వరం స్పందించాలి

_*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*_

మేడిగడ్డ,సుందిళ్ళ,అన్నారం ప్రాజెక్ట్ లపై
జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నుండి తుది నివేదికను త్వరితగతిన తెప్పించాల్సిందిగా  రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు.

వానాకాలంలో నిర్వహించాల్సిన పరీక్షలు నిర్వహించి అంతిమ నివేదికను NDSA నిపుణుల కమిటీకి సమర్పించాలని ఆయన చెప్పారు.
బుధవారం ఉదయం జలసౌదలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి NDSA కు అందించాల్సిన తుది నివేదికతో పాటు సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు చత్తీస్ ఘడ్ నుండి రావాల్సిన అనుమతులు, ముంపుకు గురయిన
సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ నష్టపరిహారం విషయంలో చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో చర్చలు తదితర అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ
నీటిపారుదలశాఖా సలహాదారుడు ఆదిత్యాదాస్,ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఆర్&ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇ.యన్.సి అడ్మిన్&జెనరల్ జి. అనిల్ కుమార్,ఓ&యం ఇ.యన్.సి నాగేందర్ రావు,ఇ.ఎన్.సి గజ్వేలు హారేరాం సి.ఇ లు రమణా రెడ్డి,అజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డిలతో పాటు డిప్యూటీ ఇ.ఎన్.సి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు చత్తీస్ ఘడ్ నుండి పొందాల్సిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు.

అదే విదంగా ఇదే ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర జలవనరుల సంఘము లేవనెత్తిన అంశాలపై సత్వరమే నివృత్తి చెయ్యాలని ఆయన అధికారులకు సూచించారు.

అదే విదంగా ఛత్తీస్ ఘడ్ లో ముంపుకు గురయిన సమ్మక్క సాగర్ కు నష్టపరిహారం విషయంలో చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో  సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు చెప్పారు.

ముఖ్యంగా ఆరు లక్షల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ను 2025 మార్చి మాసంతానికి పూర్తి చెయ్యాలన్నారు.

ఆనకట్టలు,కాలువల భద్రత కు అవసరమైన 1800 మంది లష్కరుల నియామకాలు వెంటనే పూర్తి చేయాలన్నారు.

ఈ విషయమై నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ స్పందిస్తూ ప్రక్రియను పూర్తి చేశామని ఆర్థిక శాఖా అనుమతులు పొందాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించగా అక్కడికక్కడే ఆర్థిక శాఖా కార్యదర్శి రామకృష్ణ రావు తో మాట్లాడి వెంటనే మంజూరు చెయ్యాలని ఆదేశించారు.

అదే సమయంలో నీటిపారుదల శాఖాకు ప్రజా ప్రతినిధులు పంపిన విజ్ఞాపనలకు వెంటనే స్పందించి సకాలంలో జవాబు ఇవ్వాలన్నారు.
ఇటీవల సంభవించిన వర్షపు విపత్తు ను ప్రస్తావిస్తూ ఆనకట్టలు,కాలువల భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.

క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

_

Previous article
*అమరావతి* సెప్టెంబర్11, (సమయం న్యూస్)

*చిన్నారుల పెద్ద మనసు – వరద బాధితుల కోసం పాకెట్ మనీ*

*ఆంధ్రప్రదేశ్లో వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని వర్గాల వారు సాయం చేస్తున్నారు.*

*చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.*

*తాజాగా పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్న వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.*

ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. విపత్తు సమయంలో మానవత్వం చాటుకుంటున్నారు. ప్రభుత్వం పిలుపుతో విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. ఎంతో మంది వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, గృహిణులు, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధితుల కోసం విరాళాలను అందిస్తున్నారు.

దీంతో వరద బారిన పడి సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపడుతున్న ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు వివిధ వర్గాలు, ప్రాంతాల వారు తమ స్థాయిని బట్టి విరాళాలను ఇస్తున్నారు.

*చిన్నారుల వీడియో వైరల్:* తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రులోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల చిన్నారులు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా తెగ వైరల్ అయింది. అనేక మంది పాఠశాల చిన్నారులను మొచ్చుకున్నారు.

చిన్నారుల వీడియోపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. వారిని మెచ్చుకుంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా అసాధారణ కరుణను చిన్నారులు ప్రదర్శించారని కొనియడారు. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహిస్తూ, ప్రాముఖ్యతను బోధిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని నేను అభినందించారు. ఇటువంటి చర్యలు మానవత్వంపై విశ్వాసాన్ని పెంచుతాయని స్పష్టం చేశారు.

మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు రమ్యకృష్ణ ఏజెన్సీస్ స్పందించింది. వరదల్లో తడిచి పాడైపోయిన గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా రిపేర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫోన్ నెంబర్, షాప్ అడ్రెస్తో బ్యానర్లను ఏర్పాటు చేశారు. రమ్యకృష్ణ ఏజెన్సీస్ వారిని మంత్రి లోకేశ్ అభినందించారు.

వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎల్‌జీ కంపెనీ సైతం ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబు పిలుపుతో ముందుకొచ్చిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ, ఉచితంగా సర్వీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉచిత సర్వీస్, స్పేర్ పార్టులపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫోన్, వాట్సప్ నెంబర్లను ఇచ్చారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉంటుందన్నారు.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments