Tuesday, December 10, 2024
HomeUncategorized*_హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా.._**_హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా వెలుగులోకి వ‌చ్చింది. జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్...

*_హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా.._*

*_హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా వెలుగులోకి వ‌చ్చింది. జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌పై జ‌రిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ క‌లిపి అమ్ముతున్న‌ట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్ విస్కీ క‌లిపి విక్ర‌యిస్తున్న‌ట్లు అధికారులు క‌నుగొన్నారు. ఈ ఐస్‌క్రీమ్‌ల‌ను పిల్ల‌లు, యువ‌త భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్న‌ట్లు పోలీసుల‌కు తెలిసింది. దీంతో త‌నిఖీలు నిర్వ‌హించి ఐస్‌క్రీమ్ పార్ల‌ర్ య‌జ‌మానులు ద‌యాక‌ర్ రెడ్డి, శోభ‌న్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న‌గ‌రంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్‌క్రీమ్ పార్ల‌ర్లు ఉన్నాయి, ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన విక్ర‌యాలు ఎన్ని? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు._*

*_ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో త‌ర‌చూ అక్క‌డ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసిన‌ పిల్ల‌ల పేరెంట్స్ ఆందో‌ళ‌న చెందుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు._*

Previous article
న్యూస్ అలెర్ట్:
===========

హైదరాబాద్.సెప్టెంబర్06:-
జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద
ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం
=================================

జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లకు క్రమంగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.
భారత వాతావరణ శాఖ సూచన నివేదిక ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే గేట్లు తెరిచే అవకాశం ఉంటుంది. దీంతో జ‌ల‌మండ‌లి అధికారులు సంబందిత హైద‌రాబాద్ మ‌రియు రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ ఎంసీ, పోలీసు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

1. హిమాయ‌త్ సాగ‌ర్  పూర్తి స్థాయి నీటి మ‌ట్టం – 1763.50 అడుగులు
ప్ర‌స్తుత నీటి స్థాయి – 1760.60 అడుగులు

రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం – 2.970 టీఎంసీ లు
ప్ర‌స్తుత సామ‌ర్థ్యం – 2.377 టీఎంసీ లు

2. ఉస్మాన్ సాగ‌ర్  పూర్తి స్థాయి నీటి మ‌ట్టం – 1790.00 అడుగులు
ప్ర‌స్తుత నీటి స్థాయి – 1787.20 అడుగులు

రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం – 3.90 టీఎంసీ లు
ప్ర‌స్తుత సామ‌ర్థ్యం – 3.264 టీఎంసీ లు
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments