Sunday, December 8, 2024
HomeHyderabadప్రయత్నం బెడిసి కొట్టింది... పోలీసులకు దొరికిపోయారు

ప్రయత్నం బెడిసి కొట్టింది… పోలీసులకు దొరికిపోయారు

*ప్రయత్నం బెడిసి కొట్టింది… పోలీసులకు దొరికిపోయారు*

*నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారంగా అమ్మాలనే

ఉద్దేశం*

చకచక్యంగా ముగ్గురు నేరస్తులను పట్టుకుని రిమాండ్ కు తరలించిన షాద్నగర్ పోలీసులు*

*నకిలీ బంగారం అడ్డాగా బళ్ళారి*

సమయం సమ్మతం ,  అమాయకులైన ప్రజలను నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారంగా అమ్మ జూపాలనే ప్రయత్నంతో మోసం చేయాలనుకున్న ముగ్గురు నిందితులను షాద్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. షాద్ నగర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బలరాం తెలిపిన వివరాల ప్రకారం కడ వెండి గ్రామం, దేవ్ రూపుల మండలం, జనగామ జిల్లాకు చెందిన (A1) భాషాపక సుజీత్ @ సంతోష్ @ రంజిత్, మైత్తరం గ్రామం, పాలకుర్తి మండలం, జనగామ జిల్లాకు చెందిన (A2) పలనాటి అశోక్, దేవ్ రుపుల గ్రామం మరియు మండలం, జనగామ జిల్లాకు చెందిన (A3) భాషపాక రమేష్ లు ముగ్గురు కలిసి బళ్లారిలో మహేష్ అనే వ్యక్తి దగ్గర నకిలీ బంగారం అని తెలిసి కూడా అట్టి బంగారం కొని అట్టి నకిలీ బంగారం ను ఒరిజినల్ బంగారంగా చెప్పి ప్రజలని మోసం చేసి ఎక్కువ ధరకు అమ్ముకొని ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నకిలీ బంగారం ను హైద్రాబాద్ తరలిస్తుండగా పై నేరానికి పాల్పడిన ముగ్గురు నేరస్తులను షాద్ నగర్ పోలీసు వారు నిన్న తేదీ: 05.09.2024 నాడు రాయికల్ టోల్ ప్లాజా దగ్గర పట్టుకుని అరెస్ట్ చేసారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్ నగర్ పోలీసులు క్రైం.నెం. 686 /2024, U/s 318(4), 3(5)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పై తెలిపిన ముగ్గురు నిందితుల నుండి 790 గ్రాముల నకిలీ బంగారం, స్విఫ్ట్ డిజైర్ కార్, 3 మూడు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించారు. నేరస్తులను పట్టుకోవడం చాకచక్యంగా వ్యవహరించిన ఈ కేసులో ఏసీపీ రంగస్వామి పాల్గొని

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. విజయ్ కుమార్ ను, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శరత్ కుమార్ ను మరియు అతని టీం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ బలరాం లను అభినందించారు.

Previous article
Next article
భారీ వర్షాలతో జరిగిన నష్టం పూర్తి వివరాలు అందజేయాలి.


   *భారీ వర్షాల తో జరిగిన నష్టం పూర్తి వివరాలు అందజేయాలి.

*ప్రతి మండలంలో ముగ్గురు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలి.

*పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందేలా చూడాలి.

*రక్షిత మంచినీటిని ప్రతి రోజు క్లోరినేషన్ చేయాలి.

-జిల్లా అధికారులతో కలెక్టర్ క్రాంతి వల్లూరు టెలి కాన్ఫరెన్స్.*


  గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కారణంగా జిల్లాలో జరిగిన నష్టం వివరాలను పూర్తిస్థాయిలో నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు.  శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలోని పంచాయతీ రాజ్ నీటిపారుదల, శాఖ వ్యవసాయ శాఖ, మునిసిపల్ ,విద్యాశాఖ, ట్రాన్స్కో ,డి ఆర్ డి ఏ ,రోడ్లు భవనాలు, రెవెన్యూ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడారు. ఆగస్టు నెల చివరి  వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రతి రైతు వివరాలు, ఇండ్లు కూలిపోయిన బాధితుల వివరాలు, వర్షాల కారణంగా కూలిపోయిన నష్టం సంబంధించిన   ప్రభుత్వ ఆస్తుల వివరాలు అందించాలని, ఇది వరకే జిల్లా అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు . నిర్ణీత ప్రొఫార్మాలలో వర్షాల కారణంగా జరిగిన నష్టం వివరాలను, ఫోటోలతో పాటు వెంటనే అధికారులకు అందజేయాలని సూచించారు.

ఇందుకోసం ప్రతి మండలానికి ముగ్గురు అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆర్డీవోలను కలెక్టర్ ఆదేశించారు.ఈ కమిటీలు ఆయా మండలాలకు సంబంధించిన తాసిల్దారులు ఎంపీలు పంచాయతీరాజ్ హౌసింగ్ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా అధికారులు రిపోర్టులను సమర్పించాలన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో వర్షాలు వరదల కారణంగా పంట నష్టం జరిగిన రైతు వివరాలను,  ప్రభుత్వం ఇచ్చిన ఫార్మేట్లో సమర్పించాలన్నారు . పంట నష్టం జరిగిన రైతులు నష్టపోకుండా అధికారులు చూడాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వర్షాలు వర్గాల కారణంగా చెడిపోయిన కరెంటు పోల్స్ ట్రాన్స్ఫార్మర్ల వివరాలు అందించాలన్నారు. 


వర్షాలకు నష్టం  వాటిల్లిన పిహెచ్సి సెంటర్లు,అర్బన్ హెల్త్ సెంటర్లో సమగ్ర నివేదిక సమర్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలోని రక్షిత మంచినీటి ట్యాంక్ ల వద్ద ప్రతిరోజు తాగునీటిని క్లోరినేషన్ చేసే ల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన నీటిని ప్రజలు తాగేలా అవగాహన కల్పించడంతోపాటు చల్లార్చిన నీటిని తాగేలా చూడాలన్నారు. రక్షిత మంచినీటి పైప్లైన్ లీకేజీలు వెంటనే మరమ్మతులు చేసి తాగునీరు కలుషితం కాకుండా చూడాలి అన్నారు.


వర్షాలు వరదల  కారణంగా జరిగిన నష్టం వివరాలను పూర్తిస్థాయిలో  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాల్సి  ఉన్నందున జిల్లా అధికారులు త్వరగా పూర్తిస్థాయి నష్టం వివరాలను సమగ్రంగా నిర్ణీత ప్రొఫార్మాలలో,ఫోటోలతో పాటు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి,  సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments