
*ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం..*
నాగర్ కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ఆ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పై భాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా లోని దోమల పెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సొరంగం లోని రింగ్‌లు కింద పడి ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అందులో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. మార్నింగ్ షిఫ్ట్‌లో 40 మంది కార్మికులు పని లోకి వెళ్లారు. ప్రమాదం అనంతరం సొరంగం నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఘటనాస్థలి వద్ద నీటి పారుదల శాఖ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు..