Tuesday, March 11, 2025
HomeUncategorizedఅక్రమ ఇసుక రవాణా పై కొరడా జలుపించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.నాలుగు  ఇసుక ట్రాక్టర్లను...




అక్రమ ఇసుక రవాణా పై కొరడా జలుపించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

నాలుగు  ఇసుక ట్రాక్టర్లను
పట్టుకున్న కలెక్టర్.

ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి దమ్మన్నపేట ఆరెపెల్లి గోదావరి నదిలో ఇసుక రీచ్ ల పరిశీలన

జగిత్యాల


అక్రమ ఇసుక రవాణా పై కొరడా జలుపించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

నాలుగు  ఇసుక ట్రాక్టర్లను
పట్టుకున్న కలెక్టర్.

ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి దమ్మన్నపేట ఆరెపెల్లి గోదావరి నదిలో ఇసుక రీచ్ ల పరిశీలన

ఇసుక మాఫియా పై
ఉక్కు పాదం మోపుతాం..
అక్రమంగా రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు..
కఠినంగా వ్యవహరిస్తాం..
ఇసుకను పేదలకు
అందుబాటులో ఉంచాలి..
వాగుల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి..

ఇసుక అక్రమంగా తవ్వినా, రవాణా చేసిన మాఫియా పై ఉక్కు పాదం మోపుతామని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పేర్కొన్నారు.

ఇందులో ఎంతటి వారు ఉన్నా విడిచి పెట్టే ప్రసక్తే లేదని కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బుధవారం  ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట, అరెపెల్లి  గ్రామాల్లోని శివారులో ని గోదావరి నది లో ఇసుక తవ్వకాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న దమ్మన్నపేట గ్రామ శివారులోని  గోదావరి నది లో స్వయంగా పోలీస్ బృందాలు రెవెన్యూ మైనింగ్ రవాణా అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

గోదావరి నది తీరంలో అక్రమంగా ఇసుక లోడ్ చేసుకున్న నాలుగు ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ స్వయంగా పట్టుకున్నారు. ఇసుక మాఫియా వెన్నులో వణుకు పుట్టించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాక్టర్ డ్రైవర్లతోనూ జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇసుకను తరలించేందుకు వీలులేదని, అక్రమ రవాణాకు పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. లేనియెడల ఇసుక మాఫియా పై ఉక్కు పాదం మోపుతామని, ఇందులో ఎంతటి వారు ఉన్నా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. గోదావరి నదిలో అక్రమంగా ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతాయని, తద్వారా పంటలకు సాగునీరు అందకుండా పోతుందని పేర్కొన్నారు. దీంతోపాటు పర్యావరణానికి హాని కూడా కలుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా పై జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టామని ఎక్కడా ఇసుక తరలించిన తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాను  అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
వెంటనే ట్రాక్టర్ పై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ పోలీస్ శాఖ అధికారులకు ఆదేశించారు.

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని పట్టుకొని వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజు ఇసుక రవాణా చేస్తున్నారా ఇసుక ఎక్కడికి తరలిస్తున్నారు.  అని వివరాలు ఆరా తీశారు.

ఇసుక రీచ్ ల వద్ద  ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో రాత్రి వేళల్లో విస్తృతంగా తనిఖీలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట, తహసిల్దార్ , మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments