అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్
రూ 2.25 కోట్ల విలువగల గంజాయి స్వాధీనం
8 మంది పై కేసు నమోదు
ఆదిలాబాద్ సెప్టెంబర్ 26 : ఆదిలాబాద్ జిల్లా పోలీసు లు చాకచక్య తీరుతో దాదాపు 900 కిలోల గంజాయిని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్, తలమడుగు పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పాత్రికా సమావేశంలో వివరాలను వివరించారు. తలమడుగు పోలీస్ స్టేషన్ నందు నిందితులపై క్రైమ్ నెంబర్ 104/2024 U/Sec 8(c) r/w 20(b)(ii)(c) ఆఫ్ NDPS Act 1985 తో కేసు నమోదు చేయబడిందని తెలిపారు.
కేసు వివరాలు ఇలా..
ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ అటవీ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున గంజాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను బుధవారం తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పోలీసుల పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. పెద్ద ఎత్తున గంజాయి తరలుతోందని పక్కా సమాచారంతో ఉదయం వాహనాలను తనిఖీ చేయుచుండగా ఉత్తరాఖండ్కు చెందిన ఒక ఐచర్ కంటైనర్ వాహనం నంబర్ UK08CB5318 ఆదిలాబాద్ పట్టణం వైపు నుండి మహారాష్ట్ర వైపు వెళ్లగా పోలీసుల ఆ వాహనాన్ని చెక్పోస్ట్ వద్ద ఆపి తనిఖీ చేయగా అందులో ఒక డ్రైవర్ మరియు క్లీనర్లు ఉన్నారు. పోలీసులు వారిని ప్రశ్నించగా డ్రైవర్ పేరు A3 వసీమ్ మరియు క్లీనర్ A4 అర్మాన్ అని తెలిపినారు. పోలీసులు డ్రైవర్ వసీమ్ విచారించగా అతడు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కు చెందిన A7 అన్షు జైన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన A2 పండిత్ జి,A8 సోను అన్సారి, మిత్రులందరికీ గత మూడు సంవత్సరాలుగా గంజాయి వ్యాపారం చేస్తున్నామని, అతను గత సంవత్సరం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్, సుక్మా, జగదల్ పూర్ జిల్లాల అటవీ ప్రాంతం నుండి చాలాసార్లు తన వాహనంలో గంజాయిని తీసుకువచ్చి పై ముగ్గురికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేను గంజాయి ని తెచ్చి వారికి ఇచ్చినందున వారు నాకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి వారు దానిని ఇతరులకు అమ్మడం సాధారణంగా జరుగుతుందని తెలిపారు. వసీం తెలిపిన వివరాల ప్రకారం పది రోజుల క్రితం పండిత్ జి, అతనికి పరిచయమైన ఆశిష్, మల్కాన్ గిరి ఒడిస్సా అతనితో మాట్లాడి నాకు చెప్పినాడు ఆంధ్ర ఆడిషా బార్డర్ అటవీ ప్రాంతం లో 900 కిలోల గంజాయి ఉంది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందిన ఒక పార్టీకి మరియు మాలే జిల్లాకు చెందిన ఒక పార్టీకి గంజాయి అవసరం ఉంది అని రూ 1,50,000/- ఇస్తాం అని అనగా వసీం ఒప్పుకొని క్లీనర్ అయిన అర్మాన్ కు కూడా ఈ విషయం చెప్పి తన యొక్క ఐచర్ వాహనంలో తాను మరియు అర్మాన్, ఆశిష్ మరియు పండిత్ జీ లతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి భద్రాచలం మారేడుపల్లి, చింతూరు ద్వారా ఆశిష్ చెప్పిన అటవీ ప్రాంతం ఆంధ్ర ఒడిశా బార్డర్ కు వెళ్ళగా అక్కడ ఆశిష్ కు కలిసి వారి మనుషులతో గంజాయి నింపిన ప్యాకెట్లు గల 36 బ్యాగులను వసీంకు చూపించి కంటైనర్ లో నింపడం జరిగింది. ఆశిష్ చెప్పిన కంటైనర్ వాహనం ముందు పైలెట్ వాహనంగా గంజాయి ఇవ్వాల్సిన పార్టీకి చెందిన ఒక వ్యక్తి కారులో ముందు పైలెట్ గా ఉంటాడు అని ఏదైనా సమస్య ఉంటే తాను చూసుకుంటాడని వెంటనే ఆ వాహనం నాకు తెలియజేయు దాని ప్రకారం వెళ్దామని ఆశిష్ చెప్పడం జరిగింది. ఆశిష్ కొన్ని డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు బుల్దాన, దూలె గంజాయి తరలించిన తర్వాత ఇస్తాను అని చెప్పడం జరిగింది. వసీం గంజాయి నింపుకుని వరంగల్ కరీంనగర్ మీదుగా పైలెట్ వాహనం వచ్చిన రూట్లో వస్తూ మహారాష్ట్రలోని బుల్దానాకు వెళుతున్నప్పుడు ఇక్కడ పోలీసు వారు పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. పైలెట్ వాహనం కారు ముందు వెళ్లడం జరిగింది వసీం చెప్పిన దాని ప్రకారం పంచుల ఎదుట వాటిని పరిశీలించగా అందులో ఐదు కిలోలు మరియు రెండు కిలోల కు చెందిన మొత్తం 292 ప్యాకెట్లు కలవు. వాటి తూకం వేయగా దాదాపు 900 కిలోల వరకు గంజాయి కలదు అని తెలిపారు. నిందితులను విచారించగా పై వివరాలను తెలియజేశారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ గంజాయి మార్కెట్ విలువ కిలో దాదాపు 25 వేల రూపాయలకు అమ్మ వచ్చని నిందితులు తెలిపారు. వీటి విలువ 2 కోట్ల 25 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయిని పెద్ద మొత్తంలో వాణిజ్యానికి తరలిస్తూ, విక్రయిస్తూ మరియు కొంటున్న మిగిలిన అంతరాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించి అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం జిల్లాలో ఇదే మొదటిదని పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యులు అరెస్టు చేయడంలో, కేసు నమోదులో కీలకపాత్ర పోషించిన ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి బి సురేందర్ రెడ్డి లను మరియు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఆదిలాబాద్ రూరల్ సీఐ కే ఫణిధర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, జైనథ్ సీఐ డి సాయినాథ్, ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ ఎస్సైలు అంజమ్మ, ముజాహిద్, విష్ణువర్ధన్, మరియు సిసిఎస్ రూరల్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, నగదు బహుమతి అందించి ప్రోత్సహించారు.