HomeUncategorized*అమరావతి* సెప్టెంబర్11, (సమయం న్యూస్)*చిన్నారుల పెద్ద మనసు - వరద బాధితుల కోసం పాకెట్ మనీ**ఆంధ్రప్రదేశ్లో...
*అమరావతి* సెప్టెంబర్11, (సమయం న్యూస్)
*చిన్నారుల పెద్ద మనసు – వరద బాధితుల కోసం పాకెట్ మనీ*
*ఆంధ్రప్రదేశ్లో వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని వర్గాల వారు సాయం చేస్తున్నారు.*
*చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.*
*తాజాగా పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్న వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.*
ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. విపత్తు సమయంలో మానవత్వం చాటుకుంటున్నారు. ప్రభుత్వం పిలుపుతో విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. ఎంతో మంది వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, గృహిణులు, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధితుల కోసం విరాళాలను అందిస్తున్నారు.
దీంతో వరద బారిన పడి సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపడుతున్న ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు వివిధ వర్గాలు, ప్రాంతాల వారు తమ స్థాయిని బట్టి విరాళాలను ఇస్తున్నారు.
*చిన్నారుల వీడియో వైరల్:* తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రులోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల చిన్నారులు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా తెగ వైరల్ అయింది. అనేక మంది పాఠశాల చిన్నారులను మొచ్చుకున్నారు.
చిన్నారుల వీడియోపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. వారిని మెచ్చుకుంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా అసాధారణ కరుణను చిన్నారులు ప్రదర్శించారని కొనియడారు. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహిస్తూ, ప్రాముఖ్యతను బోధిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని నేను అభినందించారు. ఇటువంటి చర్యలు మానవత్వంపై విశ్వాసాన్ని పెంచుతాయని స్పష్టం చేశారు.
మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు రమ్యకృష్ణ ఏజెన్సీస్ స్పందించింది. వరదల్లో తడిచి పాడైపోయిన గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా రిపేర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫోన్ నెంబర్, షాప్ అడ్రెస్తో బ్యానర్లను ఏర్పాటు చేశారు. రమ్యకృష్ణ ఏజెన్సీస్ వారిని మంత్రి లోకేశ్ అభినందించారు.
వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎల్‌జీ కంపెనీ సైతం ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబు పిలుపుతో ముందుకొచ్చిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ, ఉచితంగా సర్వీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉచిత సర్వీస్, స్పేర్ పార్టులపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫోన్, వాట్సప్ నెంబర్లను ఇచ్చారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉంటుందన్నారు.