HomeUncategorized*ఆయిల్ పామ్ రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వాలి**కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నీ కోరిన...
*ఆయిల్ పామ్ రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వాలి* *కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నీ కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.*
హైదరాబాద్ సెప్టెంబర్ 6 (సమయం న్యూస్)ఆయిల్ ఫామ్ రైతులకు సరైన ధర వచ్చే విధంగా చూడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజసింగ్ చౌహన్ ని వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల. నాగేశ్వర్ రావు విజ్ఞప్తి చేసారు. తెలంగాణ రాష్ట్రంలో రీజనల్ కొకొనట్ డెవలప్మెంట్ బోర్డును భద్రాద్రి కోత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయుటకు విజ్ఞప్తి. • సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అస్వరావ్ పేటలో ఏర్పాటు చేయుట విజ్ఞప్తి. • 2024-25 సంవత్సరానికి ఆయిల్ ఫామ్ గెలల ధర టన్నుకు రూll. 15,000/- కనీస మద్దతు ధర కల్పించి ఆయిల్ ఫామ్ రైతులకు భరోసా కల్పించుటకు విజ్ఞప్తి. గత వారంలో కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరద నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరా గారు పై మూడు విషయాల గురించి వివరించారు. ఈ సందర్భముగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు సరైన ధర దక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో టన్ను 20వేల రూపాయలు ఉండగా ఇటీవల కాలంలో కష్టం డ్యూటీని ఎత్తివేసారని తెలిపారు. కష్టం డ్యూటీని తగ్గించిన క్రమంలో టన్ను ధర 12 వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల రైతులకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. కనీసం మద్దతు ధర 2024-25 సంవత్సరంలో రూll. 5,000 రూపాయలు ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా తెలంగాణకు కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మాత్యులు త్వరలోనే పై మూడు విజ్ఞప్తులకు సంభందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.