హైదరాబాద్ ట్రైసిటీలోని చెరువులకు సంబంధించి ఎఫ్. టి. ఎల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు, పాటు లేఅవుట్లను హైడ్రా విభాగం ఆదివారం కూల్చివేసారు.
హైదరాబాద్ ట్రై సిటీ పరిధిలో
ని చెరువుల్లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలపై హైడ్రా విభాగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హైడ్రా విభాగం అధికారులు స్థానిక రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో మాదాపూర్ లోని సున్నం చెరువు ఎఫ్. టి. ఎల్ పరిధిలో నిర్మిస్తున్నటువంటి నాలుగు అంతస్తులు మరియు రెండు అంతస్తుల భవనాలు , ముప్పైకిపైగా షెడ్ లను అధికారులు కూల్చివేసి పది ఎకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదే రీతిలో దుండిగల్ కొత్వా చెరువు ఎఫ్. టి. ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పదకొండు డూప్లెక్స్ విల్లా భవనాలను అధికారులు తొలగించి రెండు ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో అమీనా పూర్ పెద్ద చెరువు ఎఫ్. టి. ఎల్, బఫర్ జోన్ పరిధిలోని యాభై ఒక ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్ లో ఏర్పాటు చేసిన అక్రమ లేవుట్ కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను అధికారులు తొలగించారని హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడించారు. ముఖ్యంగా నగరవాసులు ఇకపై తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకొనే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వ్యహరించాలని ప్రధానంగా అపార్ట్మెంట్లు, వ్యక్తిగత ఇండ్లు అలాగే స్థలాలు కొనుగోలు చేసే ముందు ఇవి ఎఫ్. టి. ఎల్, బఫర్ జోన్ పరిధిలో వుందా లేదా అని ముందుగా ప్రజలు నిర్ధారించుకొవాలని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచించారు.