Tuesday, December 10, 2024
HomeUncategorizedకుటుంబ సభ్యుల తో కలిసి యాదాద్రి,  కొమురవెల్లి దేవాలయాలను సందర్శించిన  మంత్రి  కొండా సురేఖ.

కుటుంబ సభ్యుల తో కలిసి యాదాద్రి,  కొమురవెల్లి దేవాలయాలను సందర్శించిన  మంత్రి  కొండా సురేఖ.



యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక బ్యాటరీ వాహనంలో దేవాలయ ప్రాంగణానికి  చేరుకున్న మంత్రి గారు కుటుంబ సభ్యులతో కలిసి గండదీపాన్ని వెలిగించి, కొబ్బరికాయ కొట్టారు. అనంతరం వేదపండితులు పూర్ణకుంభంతో, వేదమంత్రాల నడమ మంత్రిగారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేదపండితులు మంత్రి గారికి వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి సురేఖ దేవాలయ పరిసరాలను పరిశీలించి, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గత ప్రభుత్వం అట్టహాసంగా దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, భక్తుల సౌకర్యాల కల్పన విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మంత్రి సురేఖ అన్నారు. దర్శనం అనంతరం భక్తులు కూర్చోడానికి ఏర్పాట్లు లేకపోవడం, టాయిలెట్ల లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. మధ్యతరగతి ప్రజలు కొండ పైకి రావడానికి ఇబ్బందులు పడేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమూల సంస్కరణల దిశగా కార్యాచరణను అమలుచేస్తున్నదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అంతరిచిపోతున్న కళలకు చేయూనివ్వడంతో పాటు దేవాలయ విశిష్టతను, ప్రాశస్త్యాన్ని పెంపొందించేందుకు  కళావేదిక ఏర్పాటుచేసినట్లు మంత్రి తెలిపారు. సిసి కెమెరాలను నిఘా, ఎల్ సిడి, విష్ణు పుష్కరిణి స్నాన సంకల్పం, దేవాలయం బయట అఖండ దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు, పాలిచ్చే తల్లులకు లాక్టేషన్ గదులు, విష్ణు పుష్కరిణి స్నాన సంకల్పం ఏర్పాట్లతో భక్తులు ఎంతో సంతోషిస్తున్నారని మంత్రి అన్నారు. ముసలివాళ్ళు, వికలాంగులకు దైవ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లతో పాటు గుడి వద్దకు చేరుకోవడానికి మరో 3 బ్యాటరీ వెహికిల్స్ త్వరలో అందుబాటులోకి తెస్తామని మంత్రి  స్పష్టం చేశారు. అదనంగా ప్రసాదం కౌంటర్, కొండ కింద వాహన పూజకు ప్రత్యక షెడ్డు, సువర్ణ పుష్పార్చనకు గ్రిల్స్ ఏర్పాటు, 400 మంది ఆటో డ్రైవర్ లకు వారి కుటుంబాల పోషణ కోసం కొండ పైకి ఆటో సర్వీసులు నడుపుకోవడానికి వెసులుబాటు, రోజూ నిత్యాన్నదానం కార్యక్రమం ద్వారా 600 మంది నుండి 1000 మందికి భోజనాల ఏర్పాట్లు, శుక్ర, శనివారాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సురేఖ వివరించారు. స్థానిక భక్తులకు మంగళ, శనివారాల్లో ప్రత్యేక సమయంలో గర్భాలయం దర్శనం సౌకర్యాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. బంగారు తాపడం పనులు బ్రహ్మోత్సవాల లోపు పూర్తికానున్నట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి మార్గనిర్దేశనంలో ప్రతి గుడి అభివృద్ది పథంలో సాగేలా, దేవాలయ విశిష్టత ఇనుమడించేలా చర్యలు తీసుకోవడంతో పాటు టెంపుల్ టూరిజం అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నామని మంత్రి సురేఖ వివరించారు ఆతర్వాత. మంత్రి కొండా సురేఖ కొమురవెళ్లి  మల్లి కార్జున దేవస్థానాన్ని కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్బంగా మంత్రి కి దేవస్థాన పూజారులు ఘన స్వాగతం పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments