Thursday, December 26, 2024
HomeUncategorized*ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకండి* *డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్కను ఆహ్వానించిన ఎమ్మెల్యే...

*ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకండి*

*డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్కను ఆహ్వానించిన ఎమ్మెల్యే దానం*

ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను స్థానిక ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆహ్వానించారు. గురువారం ప్రజాభవన్ లో పూజారులు, ఉత్సవ మండలి సభ్యులతో కలిసి ఆయన డిప్యూటీ సీఎంను ఆహ్వానించారు. ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా ఎమ్మెల్యే దానం డిప్యూటీ సీఎంను  కోరారు.

Previous article
*హన్మకొండ*

*తేదీ: 05.09.2024*

*మట్టి గణపతుల పంపిణి కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ డా. కడియం కావ్య…..*


జల వనరులతో పాటు పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు అన్నారు.

ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణి కార్యక్రమం వాల్ పోస్టర్ ను హన్మకొండ కనకదుర్గ కాలనిలోని ఎంపీ గారి నివాసంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఎంపీ గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని చేకూరుతుందని, విగ్రహాలను నిమజ్జనం చేస్తే నీరు కలుషితం అవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ పర్యావరణ సంస్థ క్రమం తప్పకుండా మట్టి విగ్రహాలను రూపొందిస్తూ ప్రజలకు పంపిణీ చేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రజలు కూడా పర్యావరణ హితం కోసం మట్టి గణపతులనే ప్రతిష్టించాలని హితవు పలికారు.
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments