చెరువుల్లో కూల్చిన అక్రమ నిర్మాణాల వ్యర్థాలను, వాటిని తరలించేందుకు టెండర్లను ఆహ్వానించిన హైడ్రా.
20 మీటర్ల ఎత్తైన నిర్మాణాలను సైతం కూల్చేలా మిషనరీ ఉండాలంటూ టెండర్లలో సూచించిన అధికారులు.
జా కట్టర్, షేర్ కట్టర్, అడిషనల్ షేర్ కట్టర్, రాక్ కట్టర్ విత్ బ్లేడ్ ఉండే యంత్రాలు సమకూర్చాలని టెండర్లు ఆహ్వానించిన హైడ్రా.
హైడ్రా కు చెందిన లాజిస్టిక్ సపోర్టివ్ వింగ్ ద్వారా టెండర్లను ఆహ్వానించిన హైడ్రా అధికారులు.
నేటి నుండి ప్రారంభమయ్యే టెండర్లలో ఈనెల 27 వరకు బిడర్లు టెండర్లు దాఖలు చేయవచ్చు.
ఈఎండి 10,000 రూపాయలు చెల్లించి టెండర్లలో పాల్గొనవచ్చు.
టెండర్లలో పాల్గొనే వాళ్లు గతంలో ఒక నిర్మాణమైన కూల్చిన అనుభవం ఉండాలి.
మిషనరీ అంతా కూడా ఓ ఆర్ ఆర్ లోపలి భాగంలో ఉండడంతో పాటు నాలుగు గంటల్లో సైట్కు చేరుకునే విధంగా ఉండాలి.